– లడ్డూ వివాదం నుంచి డైవర్ట్ చేసేందుకు పన్నాగం
– మీరు దొంగలు కాదు.. గజ దొంగలు..
– అందుకే ఎవరూ నమ్మడం లేదు
– 11 మందిలో 10 మంది చూపు టీడీపీ వైపు
– ట్వీట్లు కాదు.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా….
– ఇది నా సవాల్
– నక్క వేషాలు వేస్తే.. తగిన గుణపాఠం
– టీడీపీ నేత బుద్దా వెంకన్న నిప్పులు
విజయవాడ: విజయసాయిరెడ్డి అనే గుంట నక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లపై ‘ఎక్స్’లో (ట్విట్టర్) మొరుగుతోంది… తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నుంచి డైవర్ట్ చేసేందుకు ఆయన పోస్టులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… వైఎస్ సీఎం అవకముందు నుంచి కూడా ఆయనతో నడిచిన నేతలు.. ఇప్పుడు వైసీపీని వీడుతున్నారు. జగన్ వైఖరి నచ్చక, నియంతృత్వ పోకడలు భరించలేక వెళుతున్నట్టు చెబుతున్నారు.
నువ్వు ట్విట్టర్ లో ఇంగ్లీష్ తో పాటు, హిందీలో ఎందుకు పోస్టులు పెడుతున్నావో అందరికీ తెలుసు. తప్పుడు లెక్కలు రాసినందుకు 16 నెలలు జైలులో ఉన్న నువ్వు.. నీతులు చెబుతావా?
జగన్ కు జైలులో రూమ్ మేట్ వి.. అందుకే.. నీకు రాజ్యసభను ఇచ్చారు. శాంతి నివాసంలో కూర్చుని ట్విట్టర్లో ఏదో వాగడం కాదు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే బయటకు వచ్చి బహిరంగ చర్చకు రా! వరదల వల్ల విజయవాడ లో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇరవై రోజుల్లో మొత్తం విజయవాడలో ముంపు పారద్రోలి.. ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రతి ఒక్కరూ విపత్తుకు స్పందించి 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ పండ్ కు విరాళాలు ఇచ్చారు.
చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో.. పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. జగన్ అధికారంలో ఉంటే.. మిమ్మలను నమ్మి ఎవరైనా ఫండ్ ఇచ్చేవాళ్ళా? మీరు దొంగలు కూడా కాదు.. గజ దొంగలు.. అందుకే ఎవరూ నమ్మడం లేదు. 151 స్థానాల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా.. మీకు సిగ్గు రాలేదు. విజయసాయిరెడ్డి తో పాటు, అవినాష్, కొడాలి నాని, పేర్ని నాని వంటి వాటిని వేరే పార్టీలో ఎవరూ చేర్చుకోరు.
నారా లోకేష్ పాదయాత్ర చేసే ముందు, ఆ తర్వాత టీడీపీకి ఎంత గ్రాఫ్ పెరిగిందో తెలుసుకో.. టీడీపీలో చంద్రబాబు తర్వాత.. లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు క్యాడర్ సిద్దంగా ఉంది. లోకేష్ పై సీనియర్లు గుర్రుగా ఉన్నారని పెట్టడానికి నీకు సిగ్గు శరం ఉందా?
ఎవరైనా ప్రశ్నలు అడిగితే.. జవాబు చెప్పలేని నువ్వు.. వారిపై విమర్శలు చేస్తావు? నీ శాంతి నివాసం గురించి చెప్పే దమ్ము నీకు ఉందా?
జగన్, విజయసాయి రెడ్డితో పాటు, మరికొంతమంది వైసీపీ నేతలు త్వరలోనే జైలుకు వెళతారు. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని దృష్టి మరల్చేందుకు లోకేష్ పై ట్వీట్లు పెడతున్నావు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తే.. నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు.
2019 నుంచి 2024 మధ్య జరిగిన అక్రమాలపై ఇప్పుడు అందరూ విస్తుపోతున్నారు. విజయసాయిరెడ్డి వంటి గుంట నక్కకు .. అసలు లోకేష్ పై మాట్లాడే కనీస అర్హత లేదు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన.. మీరు లోకేష్ ను కూడా అరెస్టు చేయాలని కుట్ర చేశారు.
తప్పు చేసినట్టు ఎటువంటి ఆధారాలు దొరక్క సైలెంట్ అయ్యారు. అవినీతికి ఆమడ దూరంలో ఉండే వ్యక్తి లోకేష్.. ఎక్కడైనా అవినీతి చేసి దోచుకునే వ్యక్తి జగన్. తిరుమల లడ్డూని అపవిత్రం చేసిన ఘటనపై విచారణ జరుగుతోంది.. చర్యలు ఉంటాయి. ఇప్పుడు ప్రజలు కూడా కనీసం 11 స్థానాలు కూడా ఇవ్వకుండా ఉండాల్సిందని భావిస్తున్నారు. క్షవరం అయితే వివరం రాదని పెద్దలు చెప్పినట్లు.. ప్రజలు జగన్ కు బోడి గుండు కొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యకు రాని జగన్.. ఇప్పుడు బయటకు వస్తున్నాడు.. మీడియా ముందుకు వస్తున్నాడు. చంద్రబాబు ఏ సమయంలో అయినా.. మీడియా ముందుకు వచ్చి సమాధానాలు చెప్పారు.
టీడీపీ విజయంలో చంద్రబాబు తోపాటు, లోకేష్ కష్టం కూడా ఉందని ఘంటాపధంగా చెబుతున్నాం. లోకేష్ పై సీనియర్లు గుర్రుగా ఉన్నారని ఎవరైనా నీకు వచ్చి చెప్పారా? సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ తో కలిసి నడిచినప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నాడు? అటువంటి సీనియర్లు జగన్ ను ఛీ కొట్టి బయటకు వెళ్ళిపోతున్నా.. మీకు సిగ్గు రావడం లేదు. ఏపీలో వైసీపీ కథ ముగిసింది.. 11 మంది ఎమ్మెల్యే ల్లో 10 మంది టీడీపీ వైపు చూస్తున్నారు.
గౌరవం ఇవ్వని చోట ఆత్మాభిమానం ఉన్న వారు ఎవరైనా ఉంటారా? విజయసాయి రెడ్డి.. నీకు నా సవాల్.. ట్వీట్లు కాదు.. దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి బహిరంగ చర్చకు రా! మీరు చేసిన దాడులు, దారుణాలపై జైలుకు వెళ్ళేందుకు సమయం దగ్గర పడుతుంది. త్వరలోనే జైలులో మళ్ళీ చిప్పకూడు తినడానికి సిద్దంగా ఉండండి. ఇంకోసారి కుంట నక్క వేషాలు వేస్తే.. విజయసాయిరెడ్డి నీకు తగిన విధంగా గుణపాఠం నేర్పుతాం.