Suryaa.co.in

Andhra Pradesh

దమ్ముంటే రా తేల్చుకుందాం

మంత్రి కొడాలికి బుద్దా వెంకన్న సవాల్

విజయవాడ : మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే రా తేల్చుకుందాం అంటూ మంత్రికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో మంత్రులు రౌడీల భాషను వాడుతున్నారని, చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నోరుపారేసుకుంటున్నారని, ఇకపై ఆయన భాషలోనే మేము కూడా సమాధానం ఇస్తామని బుద్దా వెంకన్న అన్నారు. గుడివాడలో ఇంత జరిగినా రాష్ట్ర డీజీపీ స్పందిచరా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే టీడీపీ వారిపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. చట్టం ముఖ్యమా?.. తాడేపల్లి ఆదేశాలు ముఖ్యమా?.. సంస్కారం లేకుండా చంద్రబాబును తిడుతుంటే చోద్యం చూస్తారా?.. కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదో.. డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. డీజేపీ అనే పదాన్ని జగన్ పార్టీ నేతగా సవాంగ్ మార్చేశారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE