అందుకే చంద్ర‌బాబుపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు

– వైసీపీ నేత‌ల‌కు ప‌రిపాల‌న చేత కావ‌డం లేదు
– మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు సరికాదు
– చేతగాని దద్దమ్మ లు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు
– కొడాలి నాని భాష ఏంటి? అత‌డి చరిత్ర ఏంటి?
– టీడీపీ నేత‌ బుద్ధా వెంక‌న్న‌

వైసీపీ నేత‌ల‌కు ప‌రిపాల‌న చేత కావ‌డం లేద‌ని, అందుకే త‌మ పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడిపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తున్నార‌ని టీడీపీ నేత‌ బుద్ధా వెంకన్న మండిప‌డ్డారు. మంత్రి కొడాలి నాని ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడిపై చేసిన వ్యాఖ్య‌లు స‌రికాద‌ని చెప్పారు. చేతగాని దద్దమ్మలు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారని, కొడాలి నాని భాష ఏంటి? అత‌డి చరిత్ర ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో వెంకన్న విరుచుకుప‌డ్డారు.

గుడివాడలో కొడాలి నాని ఆయిల్ దొంగ అని, గ‌తంలో పోలీసు స‌ర్వీసులో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌ను వర్ల రామయ్య లోపల వేసి చితక బాదార‌ని, ఆయ‌న‌పై చ‌ర్యలు తీసుకున్నార‌ని చెప్పారు. పోలీసులు లేకుండా విజయవాడలో స‌మ‌యం ఫిక్స్ చేసి చెప్పాల‌ని, దమ్ముంటే కొట్టుకునేందుకు రావాల‌ని వెంకన్న స‌వాలు విసిరారు.

గుడివాడలో కొడాలి నాని చట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తూ కృష్ణా జిల్లా పరువు తీస్తున్నార‌ని విమర్శించారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనేనని బుద్ధా వెంక‌న్న అన్నారు.

Leave a Reply