Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతిలో కుండపోత వర్షం

మునిగిపోయిన మధురానగర్ వీధులు
ఇళ్ళ లోకి భారీగా డ్రైనేజీ నీళ్లు
తిరుపతి నగరంలో ఆదివారం నాటి సాయంత్రం ప్రారంభమైన కుండపోత వర్షంతో వీధులన్నీ మునిగిపోయాయి. పల్లపు ప్రాంతాలన్నీ జలమయమై పోయాయి… పేదలు నివసించే మురికివాడలు


లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. మధురా నగర్ లోని వీధుల్లో నడుము లోతు కు పైగా నీళ్లు చేరిపోయాయి. డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి రావడంతో దుర్గంధం భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యల్ని పదేపదే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని ఫలితంగా మధురా నగర్ లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడమే కాకుండా కార్లు, వాహనాలు మునిగిపోయాయి. వాహనాలు దెబ్బతిని పోయే

పరిస్థితి ఎదురైంది. అనేక ఇళ్లలోకి డ్రైనేజీ నీళ్లు చేరడంతో ఈ ప్రాంత ప్రజలు దుర్గంధాన్ని భరించలేక ఇబ్బంది పడుతున్నారు.మున్సిపల్ అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం, వర్షాలు వస్తాయని ముందస్తు హెచ్చరికలు ఉన్నా తగిన విధంగా స్పందించక పోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.
రానున్న రెండు రోజుల్లో మరింత వర్షాలు కురుస్తాయని సమాచారం ఉండడంతో, ఈ ప్రాంత ప్రజలు మరింత ఆందోళనతో ఉన్నారు. పేదలు నివాసముండే ఇందిరా నగర్, సంజయ్ గాంధీ కాలనీ, శివ జ్యోతి నగర్, సుందరయ్య నగర్, సప్తగిరి కాలనీ, న్యూ ఇందిరానగర్, చెన్నా రెడ్డి కాలనీ లలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై పోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని మధుర నగర్ వాసులు కోరుతున్నారు

LEAVE A RESPONSE