– అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చాలనుకుంటున్నాడు
– తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్షనేత, యనమల రామకృష్ణుడు
విద్యుత్ మీటర్ల పేరుతో రూ.3,500 కోట్ల కుంభకోణానికి పాల్పడుతూ విద్యుత్ వినియోగం తెలుసుకునేందుకు మీటర్లు పెడుతున్నామనడం సిగ్గుచేటు.విద్యుత్ వినియోగం తెలుసుకోవాలంటే మార్కెట్ లో దొరికే రూ300 ల విద్యుత్ మీటర్ సరిపోతుంది.ఒక్కో మీటర్ రూ.35 వేలు పెట్టి కొని కుంభకోణానికి పాల్పడాల్సిన అవసరం లేదు చీకట్లో అద్దంచూపించే విధంగా బుగ్గన మాట్లాడుతున్నారు.అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
జగన్ రెడ్డి తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుల, మత ప్రాంతాల చిచ్చు పెడుతున్నారు. జగన్ రెడ్డి తన అరాచకపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.ఏడు నెలల్లో 53,500 కోట్లు అప్పు చేసింది చాలక మారిటైమ్ బోర్డు ద్వారా మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసేందుకు రంగం సిద్దం చేశారు.
2014 నుంచి 2019 ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.2,57,210 కోట్లు అయితే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు మూడేళ్లన్నరేళ్లలో రూ.4.5 లక్షల కోట్లు అప్పు చేసింది.ఏడాదికి దాదాపు రూ.1,20,000 కోట్లు అప్పు చేసి టిడిపి కంటే తక్కువ అప్పు చేసామని చెప్పడం బుగ్గన దిగజారుడుతనానికి నిదర్శనం. లక్షకోట్లు ఆఫ్ బడ్జట్ బారోయింగ్స్ చేసి బడ్జట్ లో చూపకుండా దాచిపెట్టారని కాగ్ తప్పుబట్టిన మాట వాస్తవం కాదా? వైసీపీ ప్రభుత్వ లెక్కలపై కాగ్ క్వాలిఫైడ్ ఒపీనియం ఇచ్చిన మాట వాస్తవం కాదా? రైతులకు ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేశారు.గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ, పావలా వడ్డీ, పంట రుణాలను వైసీపీ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదు.
మూడున్నరేళ్లలో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా బుగ్గన అబద్దాలకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోతోంది. టిడిపి హయాంలో దాదాపు రూ.10 వేల కోట్లు కౌలు రైతులు రుణం పొందితే వైసీపీ నాలుగేళ్లలో ఇచ్చింది కేవలం రూ.4 వేల కోట్ల లోపు మాత్రమే రోగులకు, ప్రశూతి మహిళలకు పౌష్టికారం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించపోవడంతో రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆసుపత్రులకు భోజనం నిలిపివేసిన విషయం వాస్తవం కాదా?
గుంటూరు జిజిహెచ్ లో రక్తపరిక్షలకు కూడా దిక్కులేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో ఉన్న విషయం వాస్తవం కాదా?ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.350 కోట్లు, ఈ.హెచ్.ఎస్ ఫ్యానెల్ డాక్టర్ల బిల్లులు రూ.100 కోట్లు బకాయిలు ఉన్న విషయం నిజం కాదా? ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకం బిల్లులు సైతం పెండింగ్ ఉన్న విషయం వాస్తవం కాదా?
ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో తెలుసుకోవడానికి మీటర్లు బిగిస్తున్నామని బుగ్గన చెప్పడం సిగ్గుచేటు. ఆయన తన అవివేకాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నారు.ఏఏ రంగాలలో ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో తెలుసుకోవడానికి సెఫరేట్ ఫీడర్లు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు.వీటి ద్వారా పరిశ్రమలకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో, వ్యవసాయానికి ఎంత విద్యుత్ ఖర్చవుతుందో తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా గతంలోనే చంద్రబాబు నాయుడు వ్యవసాయ మోటార్ల విద్యుత్ వినియోగం తెలుసుకోవడానికి హెచ్.పి.డీ.ఎస్ సిస్టం తీసుకొచ్చి 33 కేవీ లైన్ నుంచి 11 కేవీకి మళ్లించి ఎల్టీ లైన్ ద్వారా మోటార్లకు ఇచ్చే విధానం తీసుకొచ్చారు. అంతగా ఒక్కొ వ్యవసాయ బోరు కనెక్షన్ కు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలంటే కేవలం రూ.300 లతో మార్కెట్ లో దొరికే సాదారణ విద్యుత్ మీటర్ అమర్చితే సరిపోతుంది.దీన్ని తెలసుకోవడానికి రూ.35 వేల ఖరీదు పెట్టి స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. వ్యవసాయ బోర్లకు మీటర్ల పెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వమే వెనక్కు తీసుకుంది. కానీ జగన్ రెడ్డి మాత్రం మీటర్ల కొనుగోళ్లలో రూ.3500 కోట్ల కుంభకోణానికి పాల్పడటానికే రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నాడు. స్మార్ట్ మీటర్లతో అన్నదాతకు ప్రమాదం పొంచి ఉంది. మీటర్ ను సకాలంలో రీఛార్జ్ చేసుకోకపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కేవలం విద్యుత్ వినియోగం తెలుసుకోవడానికైతే స్మార్ట్ మీటర్లు అవసరం లేదు.