Suryaa.co.in

Political News

ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ తీసేయొచ్చు!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వం సమకూర్చిన “బుల్లెట్ ప్రూఫ్ ” వాహనాన్ని ఉపసంహరించుకోవచ్చు. వైసీపీ నేతలు కూడా ఆ చర్యను తప్పు పట్టలేరు.

రెండు రోజుల క్రితం ఆయన తాడేపల్లి నుంచి వినుకొండ వెళ్ళాలి అనుకున్నప్పుడు, ప్రభుత్వం… కండిషన్ లో ఉన్న ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చింది. అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనం లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వేలాది కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించారు అని వినుకొండ ఎంఎల్ఏ చెప్పారు. ఈ ప్రకటన ను వైసీపీ నేతలు ఎవరూ ఖండించలేదు.

కనుక, ఆ ప్రకటన లో అవాస్తవం ఏమీ లేదు అనుకోవాలి. ఇప్పుడు, బండ్లు ఓడలయ్యాయి. ఓడలు బండ్లు అయ్యాయి. వారు వీరయ్యారు. వీరు వారయ్యారు. అధికారం కోల్పోయిన జగన్ కు ప్రభుత్వం ఇప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్నే కేటాయించింది.

మొన్న వినుకొండ ఆయన రోడ్ మార్గం లో జగన్ వెళ్లారు కదా! అంతకు ముందు నెల్లూరు జిల్లా జైలు వద్దకు కు వెళ్లారు గానీ, హెలీకాప్టర్ లో వెళ్లారు. అందుకని, జనసమీకరణకు పని బడలేదు. ఇప్పుడు రోడ్ మార్గం లో కాన్వాయ్ గా జగన్ వెళ్లారు. తాడేపల్లి ఇంటి నుంచి ( ఇల్లు అదే కానీ, దానిని క్యాంపు ఆఫీస్ అనడం కుదరదు ) బయలు దేరే సమయం లో…. ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోనే బయలు దేరారు.

ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వెళ్ళగానే, ఆయన అందులోంచి దిగేసి, దాని ముందు… కాన్వాయ్ లోని మరో వాహనం లోకి మారారు. దీనివల్ల ఆయనకు రెండు ప్రయోజనాలు. ఒకటేమో ఆయనకు అది అంత సౌకర్యం ఉండి ఉండక పోవచ్చు.

ఎందుకంటె, అంతకుముందు,అయిదేళ్లు హెలికాప్టర్ లో తిరగడం ఆయనకు అలవాటై పోయి, కారుల్లో తిరగడం అలవాటు తప్పిందో ఏమో…. అందులో కూర్చో లేక వేరే కారు లోకి మారిపోయి ఉండవచ్చు. డానికి తోడు, ఈ కారు మొరాయిస్తుందని ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయవచ్చు. అందుకని ఆయన, దాని ముందు ఉన్న కారులోకి మారారు.దాంతో, ప్రభుత్వం సమాకూర్చిన కారు, ఖాళీ గానే, కాన్వాయ్ లో వెళ్లి వచ్చింది.

“దానికి ఇంధనం బొక్క….” అని ఇది చూసిన ఒక తెలుగు దేశం టీడీపీ నేతే చమత్కరించారు. నిజమే అనిపించింది. ప్రభుత్వం సమకూర్చే బుల్లెట్ వాహనం అవసరం ఉన్నదా, లేదా అని తెలుసుకోడానికి ప్రభుత్వం ఆయనకు ఒక లేఖ రాయాలి..
ఆయన వైపు నుంచి వచ్చే సమాధానం ఆధారం గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.

గతం లో చంద్రబాబు వేలాది కిలోమీటర్లు అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనం లో తిరిగి ఉన్నందున, అందులో కూర్చోడానికి అసౌకర్యం ఏమీ ఉండక పోవచ్చు.

ఆయన కూడా, జగన్ కు ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానూ, మరో పదిహేనేళ్లు ప్రతి పక్ష నాయకుడిగానూ పని చేసిననే త గానూ పని చేసిన వారే కదా! ఆయనే ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరిగారు కదా!

ఆయన తో పోల్చుకుంటే; జగన్… ఒకసారి ప్రతి పక్ష నాయకుడు, ఒకసారి ముఖ్యమంత్రి గానే కదా పని చేసింది!? అయినా, ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులో జగన్ ఐదారు కిలో మీటర్లు మించి ప్రయాణించలేక పోయారు.

గత ఐదారేళ్లు గా ఆయన బాగా సుఖానికైనా మరిగి ఉండాలి…. లేదా, చంద్రబాబు అదేపని గా తిరిగిన కార్లో తాను తాను తిరగడం ఏమిటనే నామోషీకి అయినా జగన్ పోయి ఉండవచ్చు, లేదా బాబు గారి చమట వాసన…. గుప్ గుప్ మని కొట్టి ఉండ వచ్చు, మొత్తం మీద ఆయనకు ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నచ్చలేదు.

అందువల్ల, ఆయన నుంచి ఆ విషయం స్పష్టం గా తెలుసుకుని, ఆయన కాన్వాయ్ నుంచి ఆ వాహనాన్ని ఉపసంహరించాలి. ఆయన కాన్వాయ్ లో అది ఉంచడం ఎందుకూ, అది పనిచేయడం లేదని వైసీపీ వారు అదే పనిగా నోరు పారేసుకోవడం ఎందుకూ…., లేదు, లేదు అది బ్రహ్మాండం గా పని చేస్తుంది మొర్రో అని ప్రభుత్వం వివరణలు ఇచ్చుకోవడం ఎందుకు….!?

అసలు జగన్ ఎక్కడ తిరిగితే ప్రభుత్వానికి ఎందుకు? ఆయన ప్రతి పక్ష నాయకుడు కూడా కాదాయే! ప్రభుత్వానికి ఎందుకొచ్చిన హైరానా? రోడ్డున పోయేదాన్ని నెత్తికి పూసుకోవడం కాకపోతే!?

భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE