పొన్నూరు మునిసిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనులు అధ్వానంగా ఉన్నాయి.ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.చెత్త పన్నులు వేసినా కూడా ఇంకా పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. దీనికి తోడు చెత్తను కాల్చి వేస్తున్నారు.ఇలా తగల బెట్టడం వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఈ విషయం పర్యావరణ ఇంజనీర్ గౌతమి దృష్టికి తీసుకెళ్లగా, ఇంకో సారి ఇలా జరక్కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.