అభ్యుదయ రచనల నవాబు బుచ్చిబాబు..!

75

ఇంగ్లీషు చదువు..
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ
రచనలు..
మధుర వచనలు..
అభ్యుదయ కథనాల్లో
నవాబు..మా బుచ్చిబాబు..!

కాదేదీ రచనకనర్హం..
అదే బుచ్చిబాబు ఇజం..
స్వతంత్రం..మార్క్సిజం..
ఇలాంటి ఇతివృత్తాలతో
రచనలు సాగుతున్న కాలంలో ఆయన
కలం నిండా
అభ్యుదయ కథలే..
మురిపించిన సుధలే..!

అసలు పేరు
శివరాజు వెంకట సుబ్బారావు
వచన కావ్యాలు..కధలు..
వ్యాసాలు..నాటికలు
గుప్పించిన కలం పేరు
బుచ్చిబాబు..
ఆకాశవాణిలో కొలువు
బ్రతుకుతెరువు..
బుచ్చిబాబు పటిమ తెలియాలంటే
ఆయన రాసిన
ఒక్క పుస్తకం తెరువు!

ఎప్పటికైనా
సమాజం
బాగుపడుతుందని
నమ్మే ఆశావాది..
ఆయన ఆశలో
అజ్ఞానం లేదు..
ప్రతి రచన
నా అంతరంగమథనం
అని సగర్వంగా చెబుతూ
కీర్తి మేడమెట్లు
అధిరోహించిన కథకుడు
ఆత్మవంచన తెలియని
రచయిత..
చివరకు మిగిలేది
నవల..బుచ్చిబాబు
విలువల తళతళ..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286