– రెడ్ల ఆజ్ఞ లేకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే దమ్ము ఆ 17 మంది మంత్రులకు ఉందా
– జాతిని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకునే నాయకులు కాదు మనకు కావాల్సింది
– జగన్ కు చిత్తశుద్ధి ఉంటే వెనుకబడిన వర్గాల వారిని సీఎం చేయాలి
– తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
విశాఖపట్నం : వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడుతున్నాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. గురువారం.. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా డాబాగార్డెన్స్ లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ నివాళులు అర్పించారు.
అనంతరం రామ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ లకు ప్రాధాన్యత ఇచ్చామని చెబుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం నలుగురు రెడ్డిలు ( సజ్జల రామకృష్ణారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి ) ఆజ్ఞ లేకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే దమ్ము ఆ 17 మంది మంత్రులకు ఉందా అని రామ్ ప్రశ్నించారు?. జాతిని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకునే నాయకులు కాదు మనకు కావాల్సింది జాతి కోసం పదవులను తృణప్రాయంగా వదులుకునే నిజాయితీ గల నాయకులు కావాలి అని రామ్ అన్నారు.
మంత్రివర్గంలో మిగిలిన వారికి స్థానం కల్పించినా అవి కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అన్నారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో మంత్రులు ఉన్నారని వారి వలన ఎటువంటి ఉపయోగం లేదని రామ్ ఆక్షేపించారు.
బీసీ,ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ లను మోసం చేస్తూ కేవలం రెడ్డి సామాజిక వర్గానికే వైయస్ జగన్ ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వెనుకబడిన వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రి చేయాలని రామ్ డిమాండ్ చేశారు.