ఏపీలో బీజేపీ జెండా ఎగరేస్తాం

-కేంద్రనిధులతోనేవైసీపీ ప్రభుత్వ పథకాలు
స్మృతి వనం ఏమైంది?
– సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారు
– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

నందిగామ : ఏపీలో బీజేపీ జెండా ఎగరేస్తామని, రాజధానిపై తమ పార్టీ విధానంలో మార్పు లేదని రాజధానిగా అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే నిధులిస్తున్నా, ప్రధాని ఫొటోలు పెట్టకుండా తమ స్టిక్కర్లు వేసుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. కేంన్ర పథకాలపై బీజేపీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. నందిగామ గాంధీసెంటర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావే శంలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు.

రాజధాని ప్రాంతంలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు దృష్టికి తీసుకెళ్లడంలో తాము వైఫల్యం చెందుతున్నామన్నారు. స్మృతి వనం నిర్మిస్తామన్నారు ఏమైందని సత్యకుమార్ ప్రశ్నించారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారన్నారు. దళిత సమాజం పట్ల ముఖ్యమంత్రికి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో వయసులో పెద్దవాడైన నారాయణస్వామి కాళ్ళు మొక్కే పరిస్థితికి వచ్చారని సత్యకుమార్ దుయ్యబట్టారు.

ఇంకా సత్యకుమార్ ఏమన్నారంటే.. ‘‘ ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి రాష్ట్ర ప్రజలకు ,ఏ రాజకీయ పార్టీలు గానీ సందేహం వద్దు ప్రైవేటీకరణ అంటే ఆదాయ ఉద్యోగ వనరులు సమకూర్చడం లో భాగంగా, తాత్కాలికంగా ప్రైవేట్ సంస్థల కు లీజ్ అగ్రిమెంట్ రాయటమే తప్ప వాటిని పూర్తి ప్రైవేటీకరణ చేయటం బీజేపీ లక్ష్యం కాదు ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం మంచి పద్ధతి కాదు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తాం. బీజేపీ అంటే సర్వమతాల,కులాల పార్టీ. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తాం.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిగా కేంద్ర నిధులతోనే. కానీ మా పార్టీ పేరు ఎక్కడా లేదు అదే మా దౌర్భాగ్యం. మీడియా బీజేపీ చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరుగుదల రష్యా ఉక్రెయిన్ లో యుద్ధ ప్రభావమే. కేంద్రం చాలావరకు భారం మోస్తుంది. కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ ఇవ్వడంలో భారత దేశం నెం 1 స్ధానంలో ఉంది’’