Suryaa.co.in

Political News

టీడీపీతో నష్టపోయిన యనమల

– వీటికి సమాధానం చెప్పగలవా యనమల ?

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడంవలన తీవ్రంగా నష్టపోయింది యనమల రామకృష్ణుడు యాదవ్ కుటుంబం.

అదెలాగంటే……,
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారంలో అత్యధికంగా లాభపడింది ఎక్కువ ఆర్డర్లు పొందింది యనమల అల్లుడుకు చెందిన పీఎంకే డిస్టిలరీ మాత్రమే.
అప్పట్లో రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీలను నయనా భయాన బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి లాగేసుకున్న వైసీపి ప్రభుత్వం యనమల అల్లుడికి చెందిన డిస్టిలరీని మాత్రం ముట్టలేదు సరికదా ..ఆ డిస్టిలరీ కి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. ఇదెలా సాధ్యం?

ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మారిన లిక్కర్ పాలసీ వలన ఇతర లిక్కర్ తయారీ కంపెనీలు డిస్టిలరీలు అన్నిటికీ అన్ని పాపులర్ బ్రాండ్ లు వచ్చేసరికి, యనమల అల్లుడు డిస్టిలరీకి ఆర్డర్లు సన్నగిల్లి పోయాయి. కాబట్టే యనమలకు కడుపుమంట మొదలైంది.

అందుకుతోడు యనమల తన కుమార్తెకు మంత్రివర్గంలో చోటుతో పాటు మంచి పోర్టుఫోలియో ఇవ్వాలని, తన అల్లుడిని తెదేపా నుంచి కేంద్రమంత్రిగా నియమించాలని, తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని లేదా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర ,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించాలని డిమాండ్ చేశాడు, ఇవేమీ వీలుపడకపోయేసరికి వైసీపీతో చేతులుకలిపి తెలుగుదేశంపార్టీని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు.

నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు దశాబ్దాలుగా యనమలను పామును పాలుపోసి పెంచినట్లు పెంచా రు. యనమలకు అనవసరంగా స్థాయిని పెంచి పార్టీకి నష్టం చేశారు. యనమల అదే అదునుగా పార్టీలో తనకు తిరుగులేనట్లుగా ప్రవర్తించా రు. ఇతర సీనియర్లను అందరినీ అవమానించడం గ్రూపులు కట్టడం ద్వారా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడం చేశారు. పార్టీకి ఏనాడు ఆర్ధిక సహాయం అందించలేదు, పార్టీని ఆదుకోలేదు, కార్యకర్తలకు న్యాయం చేయలేదు, తూర్పుగోదావరి జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తరువాత అయిదేళ్లలో యనమల ఏ ఒక్కరోజు కూడా పార్టీ కోసం.. బీసీల కోసం.. యాదవుల కోసం కష్టపడలేదు. పోరాడలేదు.

~సువేరా

LEAVE A RESPONSE