Suryaa.co.in

Andhra Pradesh

బాబు బెయిల్ రద్దు చేయాలని లేఖ రాయొచ్చుగా చిన్నమ్మా!

-ఎంపీ విజయసాయిరెడ్డి

నవంబర్ 22: ఎవరికి బెయిల్ వచ్చినా పురందేశ్వరి సంతోషిస్తారని, కొందరికి మాత్రమే బెయిల్ రద్దు చేయాలని ఆమె కోరుకుంటారని, లేఖలు రాస్తుంటారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా బుధవారం పలు అంశాలపై ఆయన స్పందించారు. దోచుకున్న దాంట్లో తనకు వాటా ఇచ్చే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందన్న ఆనందంలో పురందేశ్వరి తేలిపోతున్నారని అన్నారు. అలాంటిది ఏమీ లేదంటే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయగలరా అని పురందేశ్వరిని ప్రశ్నించారు.

బాబుకే లేదు ష్యూరిటీ మరి ప్రజల భవిష్యత్తుకు ఆయనెలా గ్యారెంటీ?
చంద్రబాబు బెయిల్ కే ష్యూరిటీ లేదు మరి ఆయన ప్రజల భవిష్యత్తుకు ఎలా గ్యారెంటీ ఇస్తాడని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. బాబు వస్తే ఇంటింటికీ లక్షలు వచ్చి పడతాయని పచ్చ వర్గం ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మరి 14 ఏళ్లు సీఎంగా ఉండి ఆయన ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు. ప్రజల చెందాల్సిన దాన్ని తాను దోచుకున్నాడో తన వాళ్లకు దోచిపెట్టాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

మత్స్యకారులకు అండగా జగన్ ప్రభుత్వం
మత్స్యకారులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఓఎన్ జీసీ పైప్ లైనుతో నష్టపోతున్న మత్స్యకారులకు ఇప్పటికే మూడు విడతల్లో రూ. 323.72 కోట్లు ఇచ్చారని, నాల్గో విడతగా రూ.161.86 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఆపద వేళ ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఎల్లప్పడూ ముందుంటుందని, విశాఖ హార్బర్ ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం
ఆధునిక వైద్యం ప్రజలకు అందుబాటులోకి తెచ్చే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో గుండె చికిత్సకు సంబంధించి అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తోందని విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో గుండె చికిత్స కొరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్సిస్తోందని అన్నారు. ప్రభుత్వం వైద్య రంగంలో గుండె సంబంధిత చికిత్సలు బలోపేతం చేసేందుకు సీఎం జగన్ చర్యలు చేపట్టారని అన్నారు. కాకినాడ, కర్నూలు జీజీహెచ్ లలో క్యాథ్ ల్యాబ్స్ అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఒక్కో ఆసుపత్రిలో రూ. 6 కోట్లతో అత్యాధునిక యూనిట్ ఏర్పాటు చేశారని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సీఎం జగన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అభివృద్ధి చేస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.

LEAVE A RESPONSE