-
వందేళ్ల కలను సాకారం చేస్తోన్న నాయకుడు ఆయన
-
బడుగు, బలహీనవర్గాలకు ఆయనే బలం, బలగం
-
కులగణన ఒక చరిత్రాత్మక కార్యక్రమం
-
అందుకే అందరి మద్దతు అవసరం
-
బీసీల వ్యతిరేకి చంద్రబాబునాయుడు
-
బీసీల తోక కత్తిరిస్తానన్నాడు.. మత్య్సకారుల తోలుతీస్తానన్నాడు
-
ఇప్పుడు కులగణనపై టీడీపీ విమర్శల్లో అర్ధం లేదు
-
వారి మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు
-
వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
బీసీ కుల సంఘాల కృతజ్ఞతలు:
రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదవర్గాల సంక్షేమం కులగణన కార్యక్రమంతో ముడిపడి ఉంది. జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు జగన్ బాటలు వేస్తున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పేదవర్గాల మేలుకు కులగణన అనేది కీలకం కానుంది. ఈ విషయంలో సీఎం ధైర్యంగా తీసుకున్న నిర్ణయం చూసి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఆశ్చర్యపోతున్నారు. ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా బీసీ వర్గానికి చెందిన వారే.
అయినా వారు కానీ, తాము బీసీ ప్రభుత్వాలు నడుపుతున్నామని చెప్పుకునే వారు కానీ బీసీ కులగణన జరిపేందుకు ముందుకు రాని పరిస్థితిని చూస్తున్నాం. 100 ఏళ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్న కులగణన ఒక్క బీసీలకే కాకుండా మిగతా కులాల వారికి కూడా మేలు చేయనుంది. అందుకే రాష్ట్రంలోని బీసీ సంఘాలు, ఇతర ఉప కుల సంఘాల వారంతా సీఎం ఔన్నత్యాన్ని కొనియాడుతున్నారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో ఆనందం:
బీసీ డిక్లరేషన్ సభలో బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పడమే కాకుండా.. జగన్‌గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బీసీలకు నిజంగా బ్యాక్ బోన్‌గా నిలిచారు. కులాల లెక్కలు తీయక ముందే రాష్ట్రంలో ఇప్పటివరకూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. కులం, మతం, వర్గం, రాజకీయం, ప్రాంతీయ బేధాల్లేకుండా నవరత్నాల పథకాలు అందుతున్నాయి.
అమ్మఒడి పథకం ద్వారా పిల్లల్ని చదివించుకుంటున్న అక్కచెల్లెమ్మల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులే అధికంగా ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ మ్యానిఫెస్టో ప్రకారం ప్రభుత్వ పథకాల అమలు కేలండర్ టంఛన్‌గా నడుస్తోన్నందున లబ్ధి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల మొఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా నగదు బదిలీ రూపంలో ఏకంగా రూ. 2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేశారు. అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా, ప్రతి పథకాన్ని శాచురేషన్ పద్దతిలో అమలు చేస్తున్నారు. ఆ పథకాల వల్ల లబ్ది పొందుతున్న వారిలో 76 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. అందులోనూ 50 శాతానికి పైగా లబ్దిదారులు బీసీలే. అందుకే ఆయా వర్గాలన్నీ ఆనందంగా ఉన్నాయి.
కులగణన సాహోసోపేతమైన నిర్ణయం:
‘కులగణన’ అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమం. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ చేపట్టిన మహత్తర సంకల్పంగా దీన్ని చెప్పవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇది ఆదర్శమైన కార్యక్రమం. బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ కులాల లెక్కలు తీసేందుకు ఇప్పటివరకూ ఎవరూ సాహసం చేయలేని పరిస్థితిని చూశాం. ప్రధాని మోదీ సైతం బీసీ వర్గానికి చెందినా, ఆయన కూడా బీసీ లెక్కలు తీయించే ఆలోచన చేయలేదు. కానీ సీఎం వైయస్ జగన్, ఒక గొప్ప ఆలోచన, సంకల్పంతో కులాల వారీగా లెక్కలు తీసి వారికి, విద్య, వైద్యంతో పాటు అన్ని రకాలుగా ఇంకా మెరుగైన సంక్షేమం అందించేందుకు శ్రీకారం చుట్టారు. కులగణన వల్ల రాష్ట్రంలోని పేదవర్గాలకు సంక్షేమ పథకాలు మరింతగా అందే అవకాశం ఉంది.
వెనుకబడిన వర్గాలకు గుర్తింపు:
స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. విభజిత రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం కల్పించని రాజకీయ పదవులు జగన్ నాయకత్వంలో బీసీవర్గాలకందాయి. మంత్రివర్గంలో 67శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు స్థానం కల్పించిన ఘనత జగన్‌గారికే దక్కుతోంది. 23 మంది కేబినెట్‌లో 11 మంది బీసీలకు మంత్రిపదవులు ఇచ్చారు. అంతేకాదు ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో నాలుగు రాజ్యసభ స్థానాలు బీసీలకు ఇచ్చారు.
కులగణనకు అందరి మద్దతు అవసరం:
బీసీ కులగణన అనేది వందేళ్ల క్రితం జరిగింది. కులగణన కోసం బీసీలందరూ కలలుగన్నారు. కులగణన కోసం ఎప్పటి నుంచో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు జగన్‌మోహన్‌రెడ్డి దయ వల్ల రాష్ట్రంలో బీసీ కులగణన జరుగుతోందంటే సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది.
అయితే, ఈ కార్యక్రమం గిట్టని కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల మాయమాటల్ని, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నిజానికి పార్లమెంట్‌లో ప్రతి బీసీ ఎంపీ కూడా కులగణనను కోరుకుంటున్నారు. బీహార్‌లో కులగణన జరగడం కూడా చూశాం. కనుక, రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులగణనకు అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరముంది.
బడుగుల చదువుకు ప్రోత్సాహం:
రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల విద్యపై ప్రధానంగా దృష్టి సారించింది. పేద కుటుంబాల పిల్లలకు విద్య ఖరీదైన వ్యవహారం కాకూడదని ప్రభుత్వ పాఠశాల విద్యను పూర్తిగా మార్చింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణల్ని తెచ్చింది. పేద పిల్లలు కూడా ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లుగా ఎదగాలనేది జగన్‌గారి ఆశయం. కనుకే, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాలను సద్వినియోగం చేసుకుని పిల్లలు పైచదువులు చదువుతున్నారు.
బీసీల వ్యతిరేకి చంద్రబాబు:
టీడీపీ మొదట్నుంచీ మాది బీసీల ప్రభుత్వంగా చెప్పుకుంటుంది కానీ, మంత్రివర్గం వచ్చేసరికి బీసీలకు బొటాబొటీ పదవులిచ్చారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో బీసీ మంత్రుల్లేరు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ సభ్యుల్లో అసలు బీసీలే లేరు. జడ్జీలుగా బీసీలు పనికి రారని కేంద్రానికి లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు. బీసీలను చంద్రబాబు అవమానించినప్పుడు ఆ పార్టీలోని బీసీ నేతలు ఏనాడూ నోరెత్తలేదు. అలాంటిది, ఆ పార్టీ బీసీ నాయకులు.. ఎన్నికలొస్తున్నాయని సమావేశాలు పెట్టి ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారు.
చంద్రబాబు అధికారంలో ఉండి, అహంకారపూరితంగా బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించాడు. మత్స్యకారుల తోలు తీస్తానని, అంతు చూస్తానన్నాడు. బీసీలకు చంద్రబాబు చేసిన ద్రోçహాన్ని ఎవరూ మర్చిపోలేరు.