Suryaa.co.in

Telangana

అవినీతి, బంధుప్రీతి వాళ్ల నినాదాలు..దేశం, ధర్మం మా నినాదాలు

-దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఏమైంది?
-దళితులకు వెన్నుపోటు పొడిచారు
-కొడుకు సీఎం అయినట్లు కేసీఆర్ కలలుకంటున్నాడు
-ఒక మహిళా మంత్రిని పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడే పద్ధతేనా?
-కత్రియ లో మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

చివరిదశకు ఎన్నికల ప్రచారం చేరుకుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం కనబడుతోంది.బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్నారు. అవినీతి పాలన పోవాలని చర్చించుకుంటున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో మొదటిసారి ఓ జాతీయపార్టీ బీసీని సీఎం చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల.. బీసీ సామాజిక వర్గంలో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. కులసంఘాలు సమావేశాలను నిర్వహించుకుని మమ్మల్ని కలిసి మద్దతు తెలియజేస్తున్నారు. ఇది బీజేపీకి అదనంగా కలిసొచ్చే అంశం.

ఈ దిశలో స్వరాష్ట్ర సాధనలో బీసీ సామాజిక వర్గం ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిందో.. బీసీని సీఎం చేయడంలో.. బీసీ వర్గాలన్నీ ఏకమై ముందుకొస్తున్నాయి. విద్యావంతులు, మేధావులు కూడా ముందుకొస్తున్నారు. బీజేపీకి ఎక్కువ సంఖ్యలో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల, 27 మంది బీసీ కేంద్రమంత్రులున్నారు. సామాజిక న్యాయం విషయంలో బీజేపీ మొదట్నుంచీ స్పష్టంగా ఉంది. వాజ్‌పేయి గారి సమయం నుంచీ బీజేపీ ఈ స్పష్టతతో ఉంది.అబ్దుల్ కలాం ని రాష్ట్రపతి చేశాం. రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము ని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీది.

బీజేపీ ధైర్యంగా సామాజికన్యాయం జరగాలని.. 52శాతం జనాభా కలిగిన బీసీల ఆకాంక్షలను పూర్తిచేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి దమ్ము, ధైర్యం ఉందా.. బీసీలను అవమానం చేసే విధంగా రాహుల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండండి.

దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఏమైంది. దళితులకు వెన్నుపోటు పొడిచారు. కొడుకు సీఎం అయినట్లు కేసీఆర్ కలలుకంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సామాజిక న్యాయం కోసం పనిచేయలేదు.

బీజేపీ బీసీని ప్రధానిని చేసింది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. సబ్బండవర్గాల ఐక్యతకోసం బీజేపీ పనిచేస్తోంది. కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంది. 50 ఏళ్లపాటు పాలించి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకుంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది.1969లో 369 మంది తెలంగాణ విద్యార్థులను, మలిదశ ఉద్యమంలో 1200 మందిని పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వరు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఇచ్చినమాటకు కట్టుబడి ఉండి పోరాటం చేసిన పార్టీగా.. సుష్మాస్వరాజ్ నేతృత్వంలో తెలంగాణ గొంతు పార్లమెంటులో వినిపించిన పార్టీ బీజేపీ. వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తాం.

కాంగ్రెస్ పార్టీ అవినీతికి పర్యాయపదం. 10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని యూపీఏ హయాంలో కుంభకోణాల పేరుతో దోపిడీ చేశారు. కాంగ్రెస్ ఎక్కడ పాలనలో ఉంటే అక్కడ దోపిడీయే. కర్ణాటకలోనూ ఇటీవలే అధికారంలోకి వచ్చి.. వందలకోట్ల రూపాయలను ఇక్కడ ఎన్నికల కోసం ఖర్చుచేస్తోంది. దీన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి అవినీతి ఒక వృత్తి, ఒక కళ.. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ వల్ల ఏ రాష్ట్రానికీ మేలుజరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే అస్థిరత, కాంగ్రెస్ పార్టీ అంటే ఆర్థిక అస్థిరత ఉంటుంది. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నానికి.. కాంగ్రెస్ మరింత విధ్వంసం చేస్తుంది. బీజేపీ వస్తేనే.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కాంగ్రెస్ మంత్రులే.. తాము ఇచ్చినహామీలను కర్ణాటకలో అమలు చేయలేకపోతున్నాం అని అంటున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. కుటుంబ జోక్యం, కుటుంబ పెత్తనం లేని ప్రభుత్వం కావాలి. ఈ రెండు పార్టీను కూడా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారాయి. అవినీతి, బంధుప్రీతి వాళ్ల నినాదాలు.. దేశం, ధర్మం మా నినాదాలు..

డిసెంబర్ 3న బీజేపీకి ప్రజలు బ్రాహ్మరథం పట్టనున్నారు. సెంట్రల్ నుంచి ఫండ్స్ రానందునే పథకాలు ఆలస్యం అయ్యాయనేది అర్థరహితం. తలాతోకాలేకుండా మాట్లాడతున్నాడు. మెడికల్ కాలేజీల కోసం 100 ఉత్తరాలు రాశాను అంటున్నాున. దమ్ముంటే కేసీఆర్ ఆ లేఖను బయటపెట్టాలి. మెడికల్ కాలేజీ ఇస్తానంటే నేను లేఖ రాస్తే.. మీరు స్పందించలేదు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాస్తే.. స్పందించని సీఎం.. అన్ని రాష్ట్రాలకు రాసినట్లే.. తెలంగాణకు కూడా లేఖ రాశాం. ఫార్మాట్ లో దరఖాస్తు పెట్టుకోండి వెంటనే మంజూరు చేస్తామంటే.. స్పందనేది.

హర్షవర్ధన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. లేఖ రాస్తే సమాధానం లేదు. ట్రిపుల్ ఆర్ ఎందుకు ఆలస్యమవుతోందో కేసీఆర్ చెప్పాలి. 26వేల కోట్ల ప్రాజెక్టులో గజం భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించలేదు. అందులోనూ సగం డబ్బులిస్తామన్నా రాష్ట్రం స్పందించలేదు. సైనిక్ స్కూల్ ఇస్తే.. అగ్రిమెంట్ చేసుకుని.. రాష్ట్ర ప్రభుత్వం వెనుకడగు వేసింది. కేంద్రం ఈ 9 ఏండ్లలో 9 లక్షల కోట్లు ఖర్చుపెట్టాం. రాష్ట్రాభివృద్ధికి మేం చిత్తశుద్ధితో ఉన్నాం.

ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.. మీటర్లు పెట్టుమన్నాం తప్ప..  రైతులనుంచి ఒక్క రూపాయి కూడా వసూలుచేయమని చెప్పలేదు. డిస్కంల ద్వారా ఎంత ఉత్పత్తి అవుతోంది. ఎంత పంపిణీ అవుతుంది. కంపెనీలు దొంగతనంగా వాడే కరెంటు ఎక్కడకు పోయిందో చెప్పాలి. రైతుల పేరు చెప్పి.. ఇతరులకు ఇస్తున్న కరెంటు లెక్కలు తెలవాలనేదే నిర్మలా సీతారామన్ ఉద్దేశం.ఒక మహిళా మంత్రిని పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడే పద్ధతేనా?

LEAVE A RESPONSE