– ఉద్యోగస్థులు కాళ్లతో, చేతులతో సమాధానం చెప్పేరోజులు వస్తాయి
మమతా బెనర్జీ ఇంత దారుణమైన సెక్షన్లని వాడలేదు
– ఎమ్మెల్సీ అశోక్ బాబు
తన అధికారాన్ని ఉపయోగించి ఉద్యోగస్థులపై అక్రమ కేసులు పెట్టి 1వ తేదీన జరపతలపెట్టిన ‘చలో సిఎం క్యాంపు ఆఫీస్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేసి వాయిదా వేయించడం అన్యాయమని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ ను వారంలోగా రద్దు చేస్తాం అని చెప్పిన ప్రభుత్వం. ఇంతవరకు రద్దు చేయలేదు. రద్దు చేయలేకపోతే చేయలేమని చెప్పాలిగానీ ఈ వేధింపులేంటి?
సీపీఎస్ రద్దుకు ప్రత్నామ్యాయంగా వేరే పని చేస్తాం అని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాల్సింది పోయి ఉద్యోగులపై కేసులా? మాట తప్పి మడమ తిప్పారు కాబట్టి తన చేతకాని తనాన్నిఒప్పుకోవాలి. బలం ఉందికదా అని ఉద్యోగస్థుల మీద పోలీసుల ద్వారా పశుబలం ప్రయోగించడమేంటి? ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగస్థులకు పోలీసు నోటీసులు వస్తే 2లక్షల రూపాయలు కట్టాల్సివుంటుందని బాండ్లు రాయించుకోవడం అన్యాయం. అరెస్టులు చేసి రిమాండ్ కి పంపిస్తామని బెదిరించడం మరీ అన్యాయం.
ఇలా గతంలో ఎప్పుడు జరగలేదు
గతంలో అనేక ఉద్యమాలు చేశాం, చూశాం. ఉద్యమం అణచివేత ఈ విధంగా ఉంటుందని ఇప్పుడే చూస్తున్నాం. ఉద్యమాలు చేసిన వారిని డిస్మిస్ చేశారు. ఉద్యమ సంఘ నాయకులను అరెస్ట్ లు చేశారు. ఉద్యోగస్తుల ఉద్యమాన్ని అణచేందుకు ఇంతమంది పోలిసు ఫోర్స్ ని వాడటం ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్థులపై పోలీసు వ్యవస్థను వాడారు. ఈ రేంజ్ లో లేదు. ఉద్యోగ సంఘాలు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నాయనేది ప్రభుత్వం తెలుసుకోవాలి.
సీపీయస్ రద్దు చేస్తామని, ఆర్టీసీని గవర్నమెంటులో కలుపుతామని గతంలో చెప్పారు. ఆర్టీసీని గవర్నమెంటులో కలిపారు. తెలంగాణ సిఎం దాన్ని ఒప్పుకోనని తన ఎన్నికల వాగ్దానం కాదని ఉద్యమం చేస్తే ప్రభుత్వం దాన్ని ఎదుర్కొంది.
ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో కలుపుతామని కేసిఆర్ ప్రభుత్వం మాట ఇవ్వలేదు. కాబట్టి అక్కడ ఉద్యమం చేసినా ఎదుర్కొనే నైతిక హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. కాని ఇక్కడ మాట ఇచ్చారు, కలిపి జీవోలు ఇచ్చారు. సిపియస్ రద్దు చేస్తామని మీరు చెప్పిందే. వారం అని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా అతీ గతీ లేదు. ఆర్థిక మంత్రి, ప్రభుత్వ సలహాదారులు ప్రతి సారి ఏదో ఒక సమాధానం చెప్పి ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు.
నేడు స్పష్టంగా హామీ నేరవేర్చలేం, జిపియస్ ఇస్తామని జీవోలను ఇచ్చారు. మాట తప్పను మడమ తిప్పను అన్న వ్యక్తి హామీ నేరవేర్చలేదు కనుక సాధ్యసాధ్యాలు తెలసుకోకుండా చెప్పానని ఉద్యోగ సంఘాలకు క్షమాపణ కోరాలి. క్షమాపణ చెప్పాక కూడా వారు ఉద్యమాలకు పూనుకుంటే అడ్డుకోవడానికి ప్రభుత్వానికి నైతిక హక్కు ఉంటుంది.
ఉద్యోగ సంఘాలతో మాట్లాడే తీరిక మంత్రికి ఉండటం లేదు. ఉదయం 9నుంచి6 వరకు ఏం చేస్తారో తెలియని పరిస్థితి.
ఇది 3లక్షల 25వేల మంది సీపీయస్ ఉద్యోగస్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. సిపియస్ రద్దు చేయాలి. ఉద్యమాలను రద్దు చేయడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. అనేక రకాల చర్యలు తీసుకొని ఉద్యోగ సంఘాలను భయపెడుతున్నారు. స్వాతంత్ర్య ఉద్యమం కూడ కొన్నాళ్ళు చల్లబడి తరువాత క్విట్ ఇండియాతో బ్రిటిష్ ప్రభుత్వం కొట్టుకుపోయింది. జగన్ ప్రభుత్వం కూడ కొట్టుకుపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఉద్యోగస్థులు ఒడిపోయి ఉండచ్చు కాని తర్వాత మీ పదవులని తొలగించడానికి ఎన్నికలు ఉన్నాయి.
మాట తప్పడమే కాకుండా ప్రశ్నించే వారిని శిక్షించేస్ధాయికి ప్రభుత్వం వెళ్లగలదు. ఫ్యాక్షనిస్ట్ మైండ్ ఉన్న ముఖ్యమంత్రి.. పోలీసు వ్యవస్ధ, అధికారం ఉన్నాయని అహంకారంతో ఉద్యోగస్థులను బెదిరించొచ్చు. రాబోయేది ప్రజా సంగ్రామం. అక్కడ ఎవరినీ బెదిరించలేరు. ఆరోజు వస్తే ఉద్యోగస్థులు ఏం చేస్తారనేది వైసీపీ నాయకులకు తెలుసు.
ఉద్యోగస్థులకు రాష్ట్రంలో జరిగే ఉద్యమంలో పాల్గొంటే రూ.2లక్షలు పెనాల్టీ వేస్తాం అనే నిబంధన ఏ రాష్ట్రంలో లేదు. మమతా బెనర్టీ, సిపిఐ నాయకత్వంలో రోడ్ల మీద కొట్టుకున్న సందర్భాలు కూడ ఉన్నాయి. అప్పుడు మమతా బెనర్జీ ఇంత దారుణమైన సెక్షన్లని వాడలేదు. మేం మీ డిమాండ్స్ నేరవేర్చలేం అని అదే మాట మీద నిలబడింది.
చేస్తానని చెప్పింది జగనే. చేయలేక దౌర్జన్యం చేస్తోంది కూడ జగనే. పీఆర్సీ 27శాతం ఐఆర్ ఇచ్చి, 23శాతం చిట్ ఫండ్స్ ఇవ్వడంతో అనేక మంది నష్ట పోయారు. ఉద్యోగస్ధుల ఆందోళన ఏ స్థాయిలో ఉంటుందనేది నిరూపించారు. అదిచూసి నేడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి ఉద్యోగస్థుల, సంఘ నాయకుల నోరు మూయించడం దుర్మార్గం.
ఉద్యోగస్థుల జిపియఫ్ 414కోట్లు ప్రభుత్వం వాడుకుందని లోక్ సభలో ఆర్థిక మంత్రి చెప్పారు. రిటైర్మెంటు బెనిఫిట్స్ 2కోట్ల 1వంద మీ చీఫ్ సెక్రటరీ గారే పిఆర్సీ సమావేశంలో పబ్లిక్ డాంక్యుమెంట్ విడుదల చేశారు.
ఉద్యోగస్థులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఆర్టీసీని గవర్నమెంట్ లో కలిపాం అని గతంలో ఉన్న ప్రయోజనాలను కొనసాగించలేదు. హెల్త్ కార్డుల లేకుండా, పెట్టుకున్న అడ్వాన్స్ లకు అనుమతులివ్వకుండా ఇబ్బంది పెట్టారు. అధికారం ఉందని పోలీసు వ్యవస్ధను అడ్డుపెట్టుకొని వారి నోరు మూయిస్తున్నారు. వారి మనసులో ఉన్న ఆలోచనను ఆపలేరు.
శిశుపాలుడు 100తప్పుల్లాగా జగన్ రెడ్డి పాపాల చిట్టాకి కూడ సరైన సమయం వస్తుంది. ఉద్యోగస్థులు కాళ్లతో, చేతులతో సమాధానం చెప్పేరోజులు వస్తాయి. గతంలో రాజకీయ నాయకులను ఓడిస్తాం అన్న ఉద్యోగ సంఘాలు నేడు లేకపోయినప్పటికీ.. ప్రత్యామ్నాయ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగుల మనస్తత్వాన్ని ప్రభుత్వం ఎందుకు తెలుసుకోలేకపోతుంది?జగన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి .
27శాతం ఐఆర్ ఇస్తే 32శాతం కావాలని అడిగితే 23 శాతం మాత్రమే ఇచ్చారు. నష్టపోయినా సరిపెట్టుకున్నారు. జగన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి కాదు. ఇదేమి రాచరికపాలన కాదు. ఉద్యోగ వ్యవస్ధల్లో ఏ వ్యవస్ధ కూడ బాగ లేదు. 10 శాతం ఉద్యోగస్థులు కూడా సంతృప్తికరంగాలేరని ఎమ్మెల్సీ అశోక్ బాబు విలేకరుల సమావేశంలో వివరించారు.