పరివర్తన కార్యక్రమం ద్వారా విశాఖపట్నం ఏజెన్సీ నుండి గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో పోలీసు, ఎస్.ఈ.బి, ఐటిడిఏ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయితీ, రాచవీధి గ్రామాల్లో 7 టీమ్లతో 14 కటింగ్ మెషిన్ లు 100 మంది వర్కర్స్ తో కలసి సుమారు 85 ఎకరాలు గంజాయి పంటను ధ్వంసం చేసి కాల్చివేశారు. గ్రామస్తులు నుండి ఎటువంటి ప్రతిఘటన
లేదు. గంజాయి మహమ్మారి వలన జరుగు నష్ఠాలు, కష్ఠాలు అవగాహన చేసుకొని గిరిజనులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి పంటను నిర్మూలించడానికి సహకరిస్తున్నారు . ఈ కార్యక్రమంలో జెడి ఎస్.ఈ.బి. నరేందర్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వివేక్, ఎస్.ఈ.బి. ఇన్స్పెక్టర్ కేశవరావు స్థానిక జి.మాడుగుల ఇన్స్పెక్టర్ సత్యనారాయణ , ఎస్సై శ్రీనివాస్ ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు .