నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరాలి

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి, శాసనసభ పక్ష ఉపనేత, కింజరాపు అచ్చెన్నాయుడు స్థానిక నాయకులకు పిలుపునిచ్చారు.
నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేసి వైకాపా అధికార దురంహకారానికి అడ్డుకట్ట వేయాలన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా జెండా ఎగురవేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్థానిక నాయకులకు పిలుపునిచ్చారు. వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వటంతో నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల జాబితా పరిశీలనకు అచ్చెన్న నగరానికి వచ్చారు.
54 డివిజన్లలో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల గెలుపు వ్యూహంపై చర్చించారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply