షర్మిల కాబట్టి బాపట్ల దాటనిచ్చాం..వేరేవాళ్లయితేనా?

బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన హెచ్చరిక

బాపట్లలో జరిగిన సభలో సీఎం జగన్, తనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. షర్మిల కాబట్టి బాపట్ల దాటనిచ్చామని.. వేరేవాళ్లయితే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన హెచ్చరించారు. ‘ వైఎస్ పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నా. నాపై అన్ని విమర్శలు చేసినా వైఎస్ కూతురుగానే చూసి వదిలేశా. మరొకరైతే బాపట్ల దాటేవారు కాదు’ అని ఆయన ధ్వజమెత్తారు.

Leave a Reply