– రూ.21వేలకోట్ల హెరాయిన్ పట్టుబడితే, ప్రభుత్వం, అధికారులు స్పందించరా?
– మాదకద్రవ్యాల దందాపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి.
– టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న
రాష్ట్రంలో ఎగ్స్ వాడకంకంటే డ్రగ్స్ వాడకం ఎక్కువైందని, తాలిబన్ల నుంచి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని, హెరాయిన్ ఎక్కడినుంచి వచ్చిందో, ఏపీలో సాగుతున్న హెరాయిన్ , కొకైన్, గంజాయి విక్రయాలపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
టీస్టాళ్లు, బడ్డీకొట్లు, కిళ్లీ కొట్లలో డ్రగ్స్ అమ్మకాలు స్వేచ్ఛగా జరుగుతున్నాయని, డ్రగ్స్ దిగుమతి, వాడకం, అమ్మకాలపై ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏంచేస్తోందని వెంకన్న ప్రశ్నించారు. పోలీసులు టీడీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టడంలో నిమగ్నమై మాదకద్రవ్యాలవ్యాప్తిని కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి బిగ్ బాస్ ఆదేశాలే కారణమన్న వెంకన్న, సదరు బాస్ ఆదేశాలతోనే ప్రభుత్వమే మాదకద్రవ్యాల అమ్మకాలు, వాడకాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.
రాష్ట్రంలో ఎగ్స్ స్థానంలో డ్రగ్స్ వాడకం పెరగడం, యువత వాటికి బానిసలయ్యి , మత్తులో సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నా రన్నారు. గుజరాత్ కు చెందిన పోర్టులో పట్టుపడిన రూ.21వేలకోట్ల విలు వైన హెరాయిన్ పై అధికారపార్టీ నేతలు ఎందుకు స్పందించడంలేదని వెంకన్న నిలదీశారు. సదరు హెరాయిన్ వ్యవహారంలో పట్టుబడిన సుధాకర్ అనేవ్యక్తి, కాకినాడకు చెందిన వైసీపీనేత బినామీ అనే విషయం రాష్ట్రమంతా తెలుసునన్నారు. డ్రగ్స్ దిగుమతులు, వాటి అమ్మకాల్లో వైసీపీనేతలప్రమేయం లేకుంటే, ప్రభుత్వం తక్షణమే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వెంకన్న డిమాండ్ చేశారు.
రూ.72వేల కోట్ల విలువైన హెరాయిన్,ఇతర డ్రగ్స్ ను ఎక్కడదాచారో ప్రభుత్వపెద్దలే సమాధానంచెప్పాలన్నారు. ఏ1, ఏ2 సారథ్యంలో, వారికి తెలిసినచోటే డ్రగ్స్ ను దాచిపెడుతున్నారనే అనుమానం ప్రజలందరిలోనూ ఉందన్నా రు. హెరాయిన్ స్మగ్లింగ్ దందా ప్రభుత్వకనుసన్నల్లోనే జరుగుతోందన్న టీడీపీనేత, ఆవిధంగా అక్రమమార్గంలో వచ్చే డబ్బుని కూడా సంఘవిద్రో హశక్తులకు చేరవేస్తున్నారని వెంకన్న తెలిపారు. డ్రగ్స్ ఎగుమతి, దిగుమతులతో పాటు, వాటి అమ్మకాలు, తద్వారా వచ్చే సొమ్ము తరలింపులో అధికారపార్టీ నేతల ప్రమేయం కచ్చితంగాఉందని, కాబట్టే నిఘా విభాగం, పోలీస్ శాఖ నిమ్మకునీరెత్తినట్టుగా ఉంటున్నాయని వెం కన్న స్పష్టంచేశారు.
ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటుదూరంలోనే రూ. 72కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతుంటే, ప్రభుత్వపెద్దల ప్రమేయం లేకుండా ఎలాఉంటుందన్నారు. తాలిబన్లనుంచి నేరుగా తాడే పల్లికి మాదకద్రవ్యాల ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయన్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా తిరుమలశ్రీవారికి సమర్పించే తలనీలాలు కూడా స్మగ్లింగ్ చేయబడ్డాయని, గతంలో మయన్మార్ లో అవిపట్టుబడినా కూడా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇప్పుడేమో రాష్ట్రంలో పగులురాత్రీ తేడాలేకుండా మాదకద్రవ్యాల దందా సాగుతోందని, సీఎంఇంటికి సమీపంలోనే గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగు తున్నాయన్నారు. ఈ విధంగా సాగుతున్న దందాలను ప్రోత్సహిస్తున్నది ఎవరో, ఎవరి ప్రమేయంతో హెరాయిన్ సహా, ఇతరమాదకద్రవ్యాల వ్యాపారం సాగుతోందో ప్రభుత్వమే తేల్చాలన్నారు.
ఫార్మా, డ్రగ్స్, లిక్కర్ మాఫియాలో మునిగితేలుతున్న ఉత్తరాంధ్ర బందిపోటు, ప్రభుత్వ బిగ్ బాస్ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల వాడకం జరుగుతోందన్నా రు. తాముచేస్తున్నవి కేవలం ఆరోపణలు కావని, రూ.21వేలకోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడితే, సంబంధిత అధికారులు, ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో సమాధానంచెప్పాలని వెంకన్న డిమాండ్ చేశా రు. జగన్ ప్రభుత్వం ఈ దందాపై కచ్చితంగా సీబీఐ విచారణకు ఆదేశించా ల్సిందేనని, లేనిపక్షంలో కేంద్రప్రభుత్వమే దీనిపై జోక్యం చేసుకోవాలని వెంకన్న కోరారు.
మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారంలో ఎవరి ప్రమేయం ఉందో, అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదో, పోలీసులు ఎందుకు దీనిపై నిఘాపెట్టడంలేదో తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని వెంకన్న అభిప్రాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి దాడికి వచ్చిన అధికాపార్టీ ఎమ్మెల్యేను సమర్థించిన పోలీసులు, దాడికి వచ్చిన వారిచేతిలో కర్రలు, రాళ్లు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలన్నారు. జోగి రమేశ్ దాడిఘటనను సమర్థిస్తూ డీఐజీ త్రివిక్రమవర్మ చేసిన వ్యాఖ్యలు పోలీసుల పరువు తీశాయన్నారు. చంద్రబాబునాయుడి ఇంటిపైకి దాడికొచ్చిన జోగిరమేశ్, అతని అనుచరుల కదలికలకు సంబంధించిన దృశ్యాలను బహిర్గతంచేస్తే, ప్రజలు, మీడియావారే ఎవరిది తప్పో తేలుస్తా రని వెంకన్న తేల్చిచెప్పారు.