Suryaa.co.in

Andhra Pradesh

దుగ్గిరాల ఎంపీటీసీ కోసం జగన్ మార్కు రాజకీయాలు

– ఆర్కే ఎన్నికుటిలయత్నాలు చేసినా, అక్కడి ఓటర్లిచ్చిన తీర్పుని మార్చలేడు.
• ఓట్ల లెక్కింపు సమయంలో ఎమ్మెల్యే ఆర్కే, కౌంటింగ్ కేంద్రంలోకూర్చొని మరీ అధికారులను బెదిరించాడు : పోతినేని
– టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.ఎస్.రాజు
రాజధాని అమరావతిని నాశనంచేసిన వారి జాబితాలోరెండో వ్యక్తైన ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి రాష్ట్రంలోని ధనవంతుల్లో ఒకడని, కానీ ఆయన నటన ఆస్కార్ నటులను మించిపోతోందని టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.ఎస్.రాజు ఎద్దేవాచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే … దుగ్గిరాల మండలంలోని ‘ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎమ్మెల్యే ఆర్కే స్వామీజీ మాదిరి ప్రవచనాలు చెబుతన్నాడు. మొత్తం 18 ఎంపీటీసీలకు గాను 14 స్థానాలకు ఎన్నికలు జరిగితే, దుగ్గిరాల మండలంలో 9స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. గెలిచిన టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ, పోలీసులను , రెవెన్యూ అధికారుల ను అడ్డంపెట్టుకొని మండలఎంపీపీని కైవశంచేసుకోవడానికి ఆర్కే విఫల యత్నాలుచేస్తున్నాడు. గెలిచిన అభ్యర్థులకు కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వనీయకుండా ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను బెదిరిస్తున్నాడు.
ఎమ్మెల్యే చెప్పినట్టు వింటూ, టీడీపీ అభ్యర్థులను వేధిస్తున్న దుగ్గిరాల తహసీల్దార్ ఎన్నికల నిబంధనల ప్రకారం నడుచుకుంటే మంచిది. గెలిచిన అభ్యర్థులకు కేవలం 24గంటల్లోనే ధ్రువీకరణ పత్రాలు అందించాల ని తహసీల్దార్ కు తెలియదా? దివంగత రాజశేఖర్ రెడ్డిని నమ్ముకొని ఐఏఎస్ అధికారులే జైళ్లకువెళ్లారనే వాస్తవాన్ని తహసీల్దార్ గుర్తిస్తే మంచిదని హెచ్చరిస్తున్నాం. ఒక మండలఎంపీపీ పదవికోసం పోలీసులు ప్రజాస్వామ్యాన్నిఖూనీచేస్తూ, ఆర్కేచేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తు న్నారు. రాష్ట్రంలో 90శాతం గెలిచామని వైసీపీ జబ్బలుచరుచుకుంటోంది. ప్రతిచోటా ఈ విధంగానేఅధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకొని జగన్ స్వామ్యంతో గెలిచారని తామంటున్నాం. అందుకు చాలా ఉదాహరణలున్నాయి.
ఎమ్మెల్యే ఆర్కేకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తాను పరులకు చెప్పేవి, అతనుకూడా పాటించేవాడే అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవ హరించాలని డిమాండ్ చేస్తున్నాం. దుగ్గిరాల మండలప్రజలు ఇచ్చిన తీర్పే భవిష్యత్ లో రాష్ట్రవ్యాప్తంగా వస్తుందని ఆర్కే తెలుసుకుంటే మంచి ది. దుగ్గిరాలఎంపీపీ స్థానానికి ఇప్పటికే అక్కడున్న ఓటర్లు ఆళ్ల రామకృ ష్ణారెడ్డికి బుద్ధిచెప్పారు. త్వరలో అదే ప్రాంతంలో రెండు, మూడు మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కూడా ఆర్కేకు కర్రుకాల్చి వాతపెట్టడానికి స్థానికులు సిద్ధంగాఉన్నారని స్పష్టం చేస్తున్నాం.
ఎన్నికలు అనేవి ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. కానీ టీడీపీ తరుపున పోటీలో నిలిచినవారిని గతంలోనే ఎమ్మెల్యే ఆర్కే, అతని అనుచరులు మారణాయుధాలతో బెదిరించారు. అయినా వారు వెనక్కుతగ్గకుండా ఎన్నికల బరిలోనిలిచి విజయంసాధిస్తే, నేడు పోలీసులను అడ్డుపెట్టుకొని నీచాతినీచంగా ఎంపీపీస్థానాన్ని చేజిక్కించు కోవడానికి కరకట్ట కమలాసన్ ప్రయత్నించడం దుర్మార్గం. రౌడీలు, గూండాల ద్వారా జగన్ మార్కు రాజకీయాలను అమలుచేస్తున్నాడు. దుగ్గిరాల ఓటమిపై ఆర్కే మీడియాతో ఎందుకు మాట్లాడటంలేదు.
ఆర్కే రాజధాని అమరావతికి చేసిన ద్రోహానికి మంగళగిరి ఓటర్లుకూడా త్వరలోనే ఆయనకు బుద్ధిచెప్పడానికి కంకణధారులై ఉన్నారు. దుగ్గిరాల ఎంపీపీ ఫలితమే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీస్థానంలోనూ పున రావృతమవుతుందని స్పష్టంచేస్తున్నాం. ప్రజలతీర్పు, దేవుడి ఆశీస్సుల తో గెలిచామని చెబుతున్న ముఖ్యమంత్రి, వైసీపీ సాధించిన విజయాల న్నీ దుగ్గిరాల తరహాలో అధికారులు, పోలీసులసాయంతో గెలిచినవేనని ఒప్పుకొని తీరాలి. దుగ్గిరాల ఓటర్లను, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష అభ్యర్థు లను ఆర్కే, ఆయన అనుచరులు ఎన్నిరకాలుగా బెదిరించినా దుగ్గిరాల ఎంపీపీని కైవశంచేసుకోవాలని ప్రయత్నించినా అక్కడి ప్రజలు ఆర్కే ను చెప్పులతో కొట్టడం ఖాయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
ఓట్ల లెక్కింపు సమయంలో ఎమ్మెల్యే ఆర్కే, కౌంటింగ్ కేంద్రలో కూర్చొని అధికారులను బెదిరించాడు : పోతినేని శ్రీనివాసరావు (గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి)
మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో తెలుగుదేశం పార్టీ 14స్థానాల్లో, జనసేన 2స్థానాల్లో విజయం సాధించాయి. ఒక్కోఎంపీటీసీకి 500, 600వరకు మెజారిటీ వచ్చింది. 65 ఓట్లతో గెలిచిన టీడీపీ అభ్యర్థిని కాదని, స్వయంగా ఎమ్మెల్యే ఆర్కే ప్రోద్భలంతో 21ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచారని అధికారులు ప్రకటించారు. కౌంటింగ్ కేంద్రంలోకూర్చొని మరీ ఎమ్మెల్యే ఆర్కే అధికారులను బెదిరించాడు. నిజాయితీగా వైసీపీ గెలిచింది కేవలం 5స్థానాల్లో మాత్రమే, గెలిచిన జనసేన అభ్యర్థిని కూడా గెలవలేదని ప్రకటింపచేశారు. పోలింగ్ రోజున ఆర్కే స్వయంగా గూండాలను గ్రామాల్లో దించి, ఓటర్లను భయభ్రాంతులకుగురిచేశాడు.
ఒక జనసేన అభ్యర్థి మద్ధతుతో, టీడీపీకి 9స్థానాలు వచ్చినప్పుడు దుగ్గిరా లఎంపీపీ పదవి టీడీపీకి రాక, వైసీపీకి ఎలావస్తుందో ఎమ్మెల్యే ఆర్కే నే సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దుగ్గిరాలలో ఎంపీపీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రజలెవరినీ రోడ్లపైకి రానివ్వకుండా పోలీసులతో ఆంక్షలు విధించాల్సిన అవసరమేంటి? ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యే ఆర్కేనే స్వయంగా డబ్బులు పంచాడు.
ఇన్నిచేసినా దుగ్గిరాల మండలప్రజలు ఆర్కేని, వైసీపీని ఛీత్కరించారు. ప్రజాస్వామ్య బద్ధంగాఎంపీపీ ఎన్నిక జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆర్కేపైనే ఉంది. మంగళగిరి ఎంతో ప్రశాంతమైన నియోజకవర్గం. కానీ ఆళ్ల ఎన్నికల్లో పోటీ చేసినప్పటినుంచీ నియోజకవర్గంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దుగ్గిరాల ఫలితం శాంపిల్ మాత్రమే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 60వేల పైచిలుకు ఓట్లతో గెలిచితీరుతుందని ఇప్పుడే చెబుతున్నాం. మూడురోజులనుంచీ ఎమ్మార్వోని బెదిరించిమరీ, ముస్లిం మైనారిటీ మహిళా అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఆర్కే అడ్డు కుంటున్నాడు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా తాము సిద్ధమయ్యాం. ఆర్కే ఎన్ని కుట్రలు, నీతిమాలిన పనులుచేసినా దుగ్గిరాలఎంపీపీ పదవి ఆయనకు దక్కనివ్వము.

LEAVE A RESPONSE