ఏపీ బీజేపీ ఫీడ్ బ్యాక్ ప్రముఖ లంకా దినకర్
ప్రస్తుతం హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వుల మేరకు అమరావతి ఆంద్రప్రదేశ్ రాజధాని. సౌత్ ఆఫ్రిక మోడల్ మూడు రాజధానులన్న జగన్ తన పాలనతో మూడు ప్రాంతాలను ప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతి వాస్తవ రాజధాని అయినా గుంటూరు అంటారు, అక్కడ కూడ సంవత్సరానికి ఒక శాసన సభ సమావేశమంటే దాన్ని ఏమంటారు? కర్నూల్ లో హైకోర్ట్ ఏర్పాటుకి బిజేపీ అనూకూలం. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, ఇప్పుడు బెంచ్ అంటూ రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు. సుప్రీంకోర్ట్ లో కొత్త ప్రాంతానికి హై కోర్ట్ తరలింపు లేదని అఫిడవిట్ వేసి రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేశారా లేదా.
విశాఖ ప్రజలు మీరు రుషికొండకు చేసిన అపాచి కటింగ్ మరచిపోలేకున్నారు. ఆరు సంవత్సరాల క్రితం చట్టబద్దంగా జరిగిన రాజధాని ఏంపికనే అపహాస్యం చేస్తూంటే, 85 సంవత్సరాల క్రితం చట్టబద్దత లేని కొందరి వ్యక్తుల మధ్య మాటలను ఒప్పందం అంటూ మరో విభజనకు బీజం వేస్తున్నవారిని పాలకులు అంటారా లేక విభజన వాదులు అంటారా? ముఖ్యమంత్రిగా జగన్, ఆర్థిక మంత్రిగా బుగ్గన పరిపూర్ణంగా విఫలమై అన్ని ప్రాంతాల ప్రజలను పక్క దోవ పట్టించే పనిలో బడ్డారు. జగన్ పరివారానికి పాత, కొత్త కేసుల వత్తిడి పెరగడంతో ఆ కసి ప్రజల పైన చూపుతున్నారు. జగన్ పాలనలో ప్రజలకు ఉత్తరాంధ్ర కి అపాచి కటింగ్, దక్షిణ ఆంధ్ర కి అంట కటింగ్, రాయలసీమ కి డిప్ప కటింగ్ అయ్యింది.