పొన్నూరు : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు అయ్యింది.ధూళిపాళ్ల తో పాటు మరో 92 మందిపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు.పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది.ఈవో కార్యాలయం వద్ద దూళిపాళ్ల బైఠాయించి నిరసన తెలిపారు.ఈ నిరసనపై దేవదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు.