Suryaa.co.in

Entertainment

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు!

అమరావతి: సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు…

అల్లు అర్జున్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

అమరావతి: స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పై నమోదయిన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో నంద్యాల నియోజకవర్గంలో అల్లు అర్జున్ పర్యటించడంతో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు….

స్వచ్ఛ చల్లపల్లికి హీరో రవితేజ ప్రశంసలు

చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లిలో పదేళ్లుగా జరుగుతున్న స్వచ్ఛ కార్యక్రమాలను ప్రముఖ సినిమా హీరో రవితేజ అభినందించారు. సోమవారం ఆయన స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలను అభినందిస్తూ వీడియో సందేశాన్ని పంపించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డీ.ఆర్.కే. ప్రసాద్-డాక్టర్ టీ. పద్మావతి ఆధ్వర్యంలో దేశం, రాష్ట్రం గర్వించే విధంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలు నిర్వహించడం…

తొలిరోజే రికార్డులు సృష్టించిన వేట్టయాన్

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం ‘వేట్టయాన్’. గురువారం (అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు నెలకొల్పింది. రూ. 26 కోట్లు వసూలు చేసి కోలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కాగా, విజయ్…

కోర్టుకు వచ్చిన నాగార్జున

– వాంగ్మూలం నమోదు హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, మేనకోడలు యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు రికార్డ్…

జానీ మధ్యంతర బెయిల్ రద్దు చేయండి

– పోలీసుల పిటిషన్ రంగారెడ్డి: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది, మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జాతీయ అవార్డు అందుకోవడం కోసం రంగారెడ్డి కోర్టు మంజూరు చేసిన 4 రోజుల మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేయనున్నారు. ఈ నెల 10వ…

చిత్ర సీమకు పెద్ద దిక్కు లేదు!

– బహుజన బాలకోటయ్య వ్యాఖ్య హైదరాబాద్‌: తెలుగు చిత్ర సీమకు పెద్ద దిక్కు లేదని, అందువల్లనే చిత్ర పరిశ్రమలోని నటులను రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని, వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డున పడేస్తున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మంత్రి కొండా…

రజనీకాంత్ కు స్టెంట్

– రెండు రోజుల్లో డిశ్చార్జ్ చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కు వైద్యులు స్టెంట్ వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి. ఐసీయూలో ఉన్న రజనీని… వైద్యులు ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు.రజనీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని…

బాప్ రే..దేవరా?

– ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి ఒంటిగంటకు దేవరా షో – టికెట్ ధర సుమారు 800/- – శుక్రవారం ఉదయం 7.00లకు మరో షో… టికెట్ ధర 450/- – అంతా బ్లాక్ మార్కెట్టే – అభిమానుల జేబులకు చిల్లులు పెడుతున్న థియేటర్ల యాజమాన్యాలు – దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేస్తారా? వత్తాసు పలుకుతారా? (హఫీజ్ ఖాద్రీ…

టాలీవుడ్‌కు అక్కినేని సేవలు అమూల్యమైనవి

– ఎమ్మెల్యే బాలకృష్ణ హైదరాబాద్‌: తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీమని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు….