– నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరం. లాయర్ గా జీవితాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి శ్రీకాళహస్తి నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడి అకాల మరణం తీవ్రంగా కలచివేసింది. అణునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. బొజ్జల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరం:యనమల రామకృష్ణుడు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి బొజ్జలతో కలిసి పనిచేశాను. శ్రీకాళహస్తి నియోజవర్గం నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ప్రజా నాయకుడిగా తన మార్క్ తో మంచి పేరు సంపాదించారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. వారి సమస్యలపై తక్షణమే స్పందించేవారు. మంత్రిగా పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.