Suryaa.co.in

Andhra Pradesh

సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతికి టిడిపి అధినేత చంద్రబాబు సంతాపం

అమరావతి:- ప్రముఖ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి  కృష్ణంరాజు మృతికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు అన్నారు. కేవలం నటునిగానే కాకుండా కేంద్రం మంత్రిగా కృష్ణంరాజు చేసిన సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతి తెలిపారు.

LEAVE A RESPONSE