– టిడిపి అధినేత చంద్రబాబు మండిపాటు
ఆచంట/రాజోలు, జులై 21: గోదావరి వరదలతో ప్రజల్ని బురదలో ముంచి సిఎం జగన్మోహనరెడ్డి గాల్లో తిరుగుతున్నాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆచంట మండలంలో గురువారం నాడు పలు లంక గ్రామాల్లో గోదావరి వరద బాధితులను టీడీపీ అధినేత చంద్రబాబుపరామర్శించారు. పంటులో ప్రయాణించి వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. సిద్ధాంతం వద్ద జాతీయ రహదారి నుండి కొడమంచిలి, కరుగోరుమిల్లి మీదుగా చంద్రబాబు ఆచంట నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాలకు చేరుకున్నారు. గోదావరి నదిలో పంటుపై ప్రయాణించి కనకాయలంక, అయోధ్యలంక గ్రామాలకు చేరుకున్నారు.
అయోధ్యలంకలో ట్రాక్టర్ పై ప్రయాణించి గ్రామంలో బాధితుల ఇళ్లకు వెళ్ళి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సోంపల్లి గ్రామం> చేరుకున్నారు. ఆ తరువాత పి.గన్నవరం నియోజకవర్గంలోని మానేపల్లి గ్రామంలో వరదలకు మృతి చెందిన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. వరద ముంపు బాధితుల కష్టాలు ఆయనను కలచివేశాయి.
వరద ముంపు బాధితులను ఆడుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని చంద్రబాబు మండిపడ్డారు. 1500 కిలోమీటర్లు గోదావరి ప్రయాణించి ఇక్కడికి వస్తుందని, కానీ వరద నుండి రక్షణకు ప్రభుత్వంఎటువంటి ఏర్పాట్లు చెయ్యలేదని విమర్శించారు. బాధ్యత గల సీఎం అయితే ఇక్కడికి రావాలని చెప్పారు. ఇదొక దిక్కుమాలిన చెత్త ప్రభుత్వం అని మండిపడ్డారు. 1571 మందికి ఒక్క పడవ చొప్పున కేటాయించి తరలించారు. ఇదేనా సన్నద్ధత? అని ఆయన ప్రశ్నించారు.
“నేను వస్తున్నా అని ఇప్పుడు రెండు వేలు ఇచ్చారు. కుటుంబానికి నాలుగు ఉల్లిపాయలు.. నాలుగు మిరపకాయలు ఇచ్చిన ప్రభుత్వం ఇది” అని ఎద్దేవా చేశారు. కూరగాయలు, తమలపాకు తోటలుదెబ్బతిన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు 10 వేలు ఇస్తుందని, ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? అని నిలదీశారు. రెండు వేలు ఇచ్చే ప్రభుత్వానికి బుద్ది ఉందా? ప్రశ్నించారు. అయోధ్య లంక ప్రాంతంలో ప్రభుత్వం రాగానే బ్రిడ్జి నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. లంక గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టించి మంచి నీరు ఇస్తామని చెప్పారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు సాయం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.
— Telugu Desam Party (@JaiTDP) July 21, 2022
దద్దమ్మ సీఎం న్యాయం చెయ్యడం లేదని పోలవరం ముంపు గ్రామాలు తమను తెలంగాణలో కలపాలి అంటున్నారని చెప్పారు. దళితులను జగన్ ప్రభుత్వం వేధిస్తుందని, మహాసేన రాజేష్ పై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. దళితుల పథకాలు తీసేసి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెంట టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా మహేశ్వరరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, నర్సాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పీతల సుజాత, మండపేట ఎమ్మెల్యే వేగళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, జ్యోతుల నెహ్రూ, దాట్ల బుచ్చిబాబు, అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శులు డొక్కా నాధబాబు, నామన రాంబాబు, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్, రాష్ట్ర టిడిపి బిసి సెల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు ఇంఛార్జిలు చింతమనేని ప్రభాకర్, గన్ని వీరాంజనేయులు, వలవల బాబ్జీ, ఆరుమిల్లి రాధాకృష్ణ, బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు జాతీయ రహదారిపై చంద్రబాబుకు సాదర స్వాగతం పలికారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో @ncbn గారి పర్యటన కొనసాగుతోంది.అయోధ్యలంకలో బాధిత ప్రజలను,రైతులను కలుసుకునేందుకు భీకరంగా ఉన్న వశిష్ట గోదావరిని పంటు సాయంతో దాటుతున్నారు. ఈ వయసులో ప్రజల కోసం చంద్రబాబుగారు చేస్తున్న సాహసాన్ని చూసి ‘దట్ ఈజ్ బాబు’ అంటున్నారు రాష్ట్ర ప్రజలు#APHopeCBN pic.twitter.com/wXlwitRnhl
— Telugu Desam Party (@JaiTDP) July 21, 2022