చంద్రబాబు పాపాలకు కాలం వదిలినా కర్మ వదలదు

-1.42 లక్షల మంది వరద బాధితులకు పునరావసం
-85 వేల కుటుంబాలకు నగదు సాయం
-448 వైద్య శిబిరాలు ఏర్పాటు
-ట్విట్టర్ వేదికగా ఎంపి విజయసాయిరెడ్డి

టిడిపి అధినేత చంద్రబాబు వెన్నుపోట్లతో అడ్డదారిలో రాజకీయ శిఖరాగ్రానికి చేరి ఇప్పుడు బాధితుడిగా మారి అక్కడి నుంచి జారి పడడమే జరగబోయే పరిణామమని వైఎస్ఆర్ సిపి జాతీయ కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.పలు అంశాలపై ఆయన ట్విట్టర్ లో గురువారం స్పదించారు. కాలం చంద్రబాబు పాపాలను మరుగుపరిచినా కర్మ వదలదు…అది వెంటాడుతూనే ఉంటుందన్నారు.

ఎపిపి కంపెనీ 24 వేల కోట్లతో రామాయపట్నంలో పేపరు మిల్లు పెడుతోందని 2018లో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబునాయుడు హడావిడిగా భూమిపూజ చేసారని చెప్పారు. ఆ కంపెనీ ఇప్పుడు పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని దివాళా పిటిషన్లు వేసిందని వెల్లడించారు. పేపరు మిల్లు పెట్టడం లేదని చేతులెత్తేసిందని, చంద్రబాబు వేసిన పునాది రాళ్ళన్నింటికీ ఇదే గతి పట్టిందని అన్నారు.

36 లక్షల క్యూసెక్కుల వరదతో గోదావరి ప్రళయంలా విరుచుకుపడినా 45 లక్షల మందిని అప్రమత్తంచేసి, లోతట్టు ప్రాంతాల వారిని శిబిరాలకు చేర్చడంలో రాష్ట్రంలోని వలంటరీర్లు, గ్రామ సెక్రటేరియట్ల పాత్ర అమోఘమని నీతి అయోగ్ ఉన్నతాధికారి కొనియాడారని ఆయన చెప్పారు.

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గోదావరి వరద బాధితులను ఎక్కడికక్కడ ఆదుకుంటూ సహాయ చర్యలను శరవేగంగా కొనసాగిస్తోందని చెప్పారు. పునరావాస కేంద్రాలతో పాటు వరద ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికీ సరుకులు పంపిణీ చేస్తోందన్నారు. నగదు సాయం చేయ్యడంతో పాటు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందన్నారు.

Leave a Reply