Home » అమిత్ షాకు తప్పిన ప్రమాదం

అమిత్ షాకు తప్పిన ప్రమాదం

– ఎగరకుండా గాల్లో హెలికాఫ్టర్ చక్కర్లు..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది. బీహార్లోని బెగూసరాయ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమిత్ షా… దాన్ని ముగించుకుని మరో ప్రాంతానికి పయనం అయ్యారు. ఈ సమయంలో అమిత్ షా ఎక్కిన హెలికాఫ్టర్.. గాల్లోకి లేచిన తర్వాత అమాంతం బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో కాసేపు గాల్లోనే అలాగే చక్కర్లు కొడుతూ కనిపించింది.

బెగూసరాయ్ లో గాల్లోకి ఎగిరిన అమిత్ షా హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొడుతూ పక్కకు ఒరిగిపోయినట్లు కనిపించింది. అయితే పైలట్ మాత్రం హెలికాప్టర్ ను కిందకు దించలేదు. అలాగే గాల్లొనే చక్కర్లు కొడుతూనే ఎలాగోలా పైకి ఎగిరి వెళ్లిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఒక వేళ ఆ హెలికాప్టర్ అలాగే ఎగరకుండా కిందకు పడిపోయిం ఉంటే అమిత్ షాకు పెను ప్రమాదం జరిగి ఉండేదని భావిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా ప్రస్తుతం ప్రైవేటు హెలికాఫ్టర్లను తీసుకుని సుడిగాలి ప్రచారానికి వెళ్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న అమిత్ షా.. ఒంటరిగానే పలు రాష్ట్రాల్ని చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హెలికాఫ్టర్ ఒక్కసారిగా కుదుపులకు గురికావడంపై బీజేపీ నేతల్లో సైతం కాసేపు ఆందోళన నెలకొంది. అయితే ఆ తర్వాత ఆయన సేఫ్ గా వెళ్లిపోయారని తెలిసి బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply