Suryaa.co.in

Andhra Pradesh

క్యాట్‌లో ఏబీ కేసు తీర్పు వాయిదా

తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటే శ్వరరావు క్యాట్‌లో వేసిన కేసుపై తీర్పు వాయిదా వేశారు. ఒకే కారణంతో ఏబీని రెండుసార్లు సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఏబీ న్యాయవాది ఆదినారాయణ వాదించారు. అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు. అయితే అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. అభియూగపత్రం నమోదు చేసి వాదనలు ముగిసే వరకూ, సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించారు. ప్రెస్‌మీట్ పెట్టి సర్వీసు రూల్సును ఉల్లంఘించినందుకే ఏబీని సస్పెండ్ చేశామన్నారు. మరి దానిపై అప్పుడే నోటీసు ఇచ్చి ఎందుకు చర్యలు తీసుకోలేదని క్యాట్ ప్రశ్నించింది. కాగా తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

LEAVE A RESPONSE