Home » ప్రజలకు ఆస్తులు జగన్ తాత ఇచ్చాడా?

ప్రజలకు ఆస్తులు జగన్ తాత ఇచ్చాడా?

-పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు?
-వైసీపీ పాలనలో ప్రజల బ్రతుకులు చిద్రమయ్యాయి
-సైకో జగన్ కు తెలిసిందల్లా రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, కేసులు
-రాయలసీమకు జగన్ ఏం చేశారు? ప్రజలు ఎందుకు ఓటేయాలి?
-రాష్ట్ర ద్రోహి జగన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలి
-నందికొట్కూరు ఆడపడుచును ఢిల్లీకి పంపాలి
-నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

నందికొట్కూరు ఈ సభ జనసముద్రాన్ని తలపిస్తోంది. ఈ జన ప్రభంజనాన్ని చూసిన వైసీపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని అర్థమైంది. ఈ ప్రజానీకాన్ని చూస్తే 20 సంవత్సరాల చరిత్రను నందికొట్కూరులో తిరిగి రాయబోతున్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన నందికొట్కూరులో మీరు కొట్టే దెబ్బకి వైసీపీ గుండె పగలాలి. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని స్పష్టంగా కనిపిస్తోంది. దళిత ద్రోహి సైకో జగన్ రెడ్డిని ఇక్కడే పూడ్చిపెట్టాల్సిన అవసరం ఉంది. నూతన చరిత్రను తిరగరాయడానికి నందికొట్కూరే ప్రారంభం. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తిని, ఇళ్లు, ఊరు, ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్.

రాష్ట్రంలో యువత, రైతులు, బీసీలు, ముస్లిం, మైనార్టీలు జగన్ పాలనతో తీవ్రంగా నష్టపోయారు. సైకో జగన్‍కి తెలిసింది రద్దులు, గుద్దులు, నొక్కుడు, బొక్కుడు, కూల్చివేతలు, దాడులు మాత్రమే. ఇవి కాకుండా ఈ ప్రాంతానికి జగన్ రెడ్డి ఒక్క మంచిపని చేయలేదు. నందికొట్కూరు, నంద్యాల జిల్లా అభివృద్ధిపై జగన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. నేను నందికొట్కూరు నుంచి సవాల్ విసురుతున్నా. నేనేం చేశానో చెబుతున్నా. ఈ జిల్లాను తీసుకుంటే… తంగడంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు ముందుకెళ్లాను. తంగడంచెని భారతదేశానికే సీడ్ క్యాపిటల్‍గా చేయాలని సంకల్పిస్తే.. జగన్ రెడ్డి సర్వనాశనం చేశారు.

రూ.365 కోట్లతో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి రాయలసీమను హార్టికల్చర్ హబ్‍గా చేసి మీ ఆదాయాన్ని పెంచేలా ప్రణాళిక రూపొందించాం. అమెరికాలోనే బెస్ట్ విద్యాసంస్థ అయోవా యూనివర్సిటీ. ఆ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. కానీ ఈ దుర్మార్గుడు, దుష్టుడు ఆ ఎంఓయూ నేను చేశానన్న కారణంతో మీ పొట్టకొట్టాడు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కాకుండా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. 12 పంప్‍లు పూర్తి చేసి ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరివ్వడానికి శ్రీకారం చుట్టా. ఓర్వకల్లులో పరిశ్రమల కోసం 30,000 ఎకరాల్లో ఇండస్ట్రీలైజేషన్ తీసుకురావాలని సంకల్పించాం.

విస్పాత్ స్టీల్ సైతం ఓర్వకల్లులో ఏర్పాటు చేశాం. కేవలం ఒక ఏడాదిలోనే ఓర్వకల్లులో విమానశ్రయం నిర్మించిన ఘనత టీడీపీది. ఓర్వకల్లు నుంచి ఎయిర్ కార్గో ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టాను. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ను నందికొట్కూరు ప్రాంతానికి తీసుకొచ్చాం. గాలిమరలు, పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. ఇవన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటై ఉంటే హైదరాబాద్‍కి కర్నూలు, నందికొట్కూరు ఒక సెటిలైడ్ టౌన్‍షిప్‍గా తయారయ్యేది. ఇవన్ని రాకుండా చేసిన ఈ రాయలసీమ ద్రోహిని, నందికొట్కూరును నాశనం చేసిన వ్యక్తిని మీరు క్షమిస్తారా?

ఈ జగన్ ఒక సైకో, ఒక అహంకారి, విధ్వంసకారుడు. ఊరికొక సైకోను తయారుచేశాడు. ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఉన్నాడు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత పరదాలు కట్టుకుని తిరుగున్నారుడు సైకో జగన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఉండేందుకు జగన్ కు అర్హత ఉందా? పరిపాలన చేతకాని వ్యక్తి జగన్. డ్రైవింగ్ చేతకాని వ్యక్తికి మీరు డ్రైవింగ్ అప్పగించారు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్ లో తీసుకెళుతూ అందరి జీవితాలను నాశనం చేస్తున్నాడు. ప్రపంచంలో దీటైన నగరంగా హైదరాబాద్‍ని తయారు చేశాం. హైదరాబాద్ పాతబస్తీకి దగ్గరలో ఎయిర్‍ పోర్ట్, ఔటర్‍ రింగ్ రోడ్డు రావడంతో ముస్లింలు, ఆ ప్రాంత వాసులు అభివృద్ధి చెందారు.

జగన్ రెడ్డికి సంపద సృష్టించడం తెలీదు. సంపద సృష్టించకుండా సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 పన్నుల ద్వారా వసూలు చేయడమే కాకుండా.. రూ.1000 దోచుకుంటూ దోపిడీదొంగలా తయారయ్యాడు జగన్. బటన్ నొక్కుడు ద్వారా ఇచ్చింది ఎంతా? బొక్కింది ఎంతా? దోచింది ఎంతో సమాధానం చెప్పాలి. రాయలసీమకు గుండెకాయ లాంటి పెనకచర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‍, గాలేరు-నగరి ప్రాజెక్ట్, హంద్రీనీవా, కేసీ కెనాల్, తెలుగుగంగ ఈ ప్రాంతం నుంచె వెళ్తున్నప్పటికీ మీకు నీళ్లు లేవు. మాండ్ర శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి పట్టుదలతో పోరాడారు.

శివానందరెడ్డికి న్యాయం చేసే బాధ్యత నాది. జయసూర్యను నందికొట్కూరు ప్రజలు గెలిపించాలి. భారీ మెజార్టీతో నందికొట్కూరు ఆడపడుచు బైరెడ్డిని శబరిని ఢిల్లీ పార్లమెంట్‍కు పంపించాలి. నందికొట్కూరులో ఎన్ని వేల మెజార్టీతో టీడీపీని గెలిపిస్తే అందుకు మూడు రెట్ల ఎకరాలకు నీరు ఇవ్వాలని శివానాందరెడ్డి కోరుతున్నారు. అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదయాన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు పంచాలన్నదే నా అభిమతం, నా బ్రాండ్. పది లక్షల ఎకరాల్లో హర్టికల్చర్ అభివృద్ధి చేయడం కోసం డ్రిప్ ఇరిగేషన్ చేయాలని సంకల్పిస్తే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. నాలుగువేల కోట్లతో ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను టీడీపీ ప్రభుత్వంలో అందజేశాం. పాడిరైతుల సంక్షేమానికి గోకుల షెడ్లను నిర్మాణం చేసిన పార్టీ టీడీపీ.

టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు. రాయలసీమలో ముఠాలను అణిచివేశాం. హైదరాబాద్‍లో మతసామరస్యాన్ని కాపాడాం. తీవ్రవాదులపై పోరాడిన పార్టీ, రౌడీలను లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం. వైసీపీ పాలనలో రాజకీయ రౌడీలు తయారయ్యారు. ఊరుకొక సైకో తయారయ్యాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజకీయ రౌడీలను తుంగలో తొక్కే బాధ్యత నాది. రాజకీయం అంటే సేవాభావం.. ప్రజలను అణగదొక్కడం కాదు.. ఖబడ్దార్ జాగ్రత్త. రాజకీయ రౌడీలను ప్రజాకోర్టులో శిక్షించే బాధ్యత తీసుకుంటాం.

రూ.వెయ్యిగా ఉన్న ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేలకు పెంచి దోచుకుంటున్నారు. స్థానికంగా ఇసుకను అందుబాటులో లేకుండా చేసి హైదరాబాద్‍, బెంగళూరుకి తరలించి వైసీపీ నాయకులు సొమ్ముచేసుకుంటున్నారు. మన ప్రాంత ఇసుకను దోచుకుని భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టాడు జగన్ రెడ్డి. వైసీపీ పాలనలో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి పేదలను దోచుకున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో ఏనాడూ కరెంట్ ఛార్జీలు పెంచలేదు. టీడీపీ ప్రభుత్వంలోనే మిగులు కరెంట్‍ను సాధించాం.

కూటమి ప్రభుత్వం వచ్చాక అందుబాటులో కరెంట్ ఛార్జీలు ఉంచి భవిష్యత్తులో పెంచబోమని హామీ ఇస్తున్నా. మీ ప్రాంతంలోనే కరెంట్ తయారు చేసుకునే సౌలభ్యం కల్పించడమే కాకుండా తిరిగి ప్రభుత్వానికి అమ్మేలా చూస్తాం. ఆలోచనలతోనే అభివృద్ధి సాధ్యం.. స్వార్థం, దోపిడీలతో రాష్ట్రం సర్వనాశనం. జగన్ రెడ్డి పాలనలో సామాన్య ప్రజలు అన్నివిధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సుపరిపాలన ద్వారా మళ్లీ ధరల నియంత్రణ చేసి మీకు మెరుగైన జీవనప్రమాణాలు అందించే బాధ్యత నాది.

నిరుద్యోగ ద్రోహి జగన్
జాబ్ క్యాలెండర్, డీఎస్సీ అంటూ యువతను జగన్ మోసం చేశాడు. ఓర్వకల్లులో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకూ చొరవ తీసుకోలేదు. పరిశ్రమలు వచ్చి.. జాబ్ రావాలంటే.. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలి. 25 ఏళ్ల క్రితమే హైదరాబాద్‍లో హైటెక్‍ సిటీతో ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. టీడీపీ చొరవతోనే హైదరాబాద్ నగరం మహానరంగా తయారైంది. బాబుది విజన్.. జగన్‍ది పాయిజన్. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాం.

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నందికొట్కూరు నుంచే ప్రైవేట్ కంపెనీలకు పని చేసే విధంగా వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తాం. నందికొట్కూలో యువతకు స్కిల్ డెవలప్‍మెంట్ చేసి, వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 30 ఏళ్లకు ముందు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఊహించే ప్రత్యేకత నాది. అదే విజన్‍తో నాలెజ్డ్ అకానమీతో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇస్తున్నా. డీఏలు, టీఏలు, పీఎఫ్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను గౌరవిస్తాం. ఉపాధ్యాయులకు గౌరవమిచ్చి తల్లి, తండ్రి, గురువు అనే నినాదానికి శ్రీకారం చుట్టే బాధ్యత నాది.

గులక రాయి డ్రామాను ప్రజలు నమ్మలేదు
గులకరాయి దెబ్బతో డ్రామా రాయుడు జగన్ సానుభూతి పొందాలని చూశాడు. బాబాయ్‍ని గొడ్డలితో హత్య చేసిందెవరో అందరికీ తెలుసు. న్యాయం అడిగిన వివేకా కూతురు సునీతనే నిందితురాలిగా చేసి.. కేసులు పెట్టి వేధించే సైకోని చూశారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడారు. ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామాతో నాటాకాలు ఆడుతున్నారు. నేను జగన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని ఆయన సతీమణి భారతి బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. హత్యా రాజకీయాలు జగన్ రెడ్డి వృత్తి, ప్రవృత్తి. హత్యా రాజకీయాలు చేసే విధానాం కాదు నాది.. హత్య చేసే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా.

ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం. భవిష్యత్తులో కూడా రిజర్వేషన్లు కాపాడతాం. మసీదుల నిర్మాణానికి టీడీపీ ఆర్థిక సాయం చేస్తే మసీదులు కూలగొడతామని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మైనార్టీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. 1995, 2004, 2014లో ఎన్డీతో పొత్తులో ఉన్నప్పటికీ ఏ ఒక్క ముస్లింకి అన్యాయం జరగలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా, దుల్హాన్ పథకం, విదేశీ విద్యను అమలు చేశాం. మసీదులకు మరమ్మతులు, ఇమామ్‍లు, మౌజన్లకు జీతాలు ఇచ్చాం. ఉర్దూను రెండో భాషాగా చేర్చాం, హౌజ్ హౌస్‍లు కట్టాం, ఉర్దూ యూనివర్సీటీలు పెట్టాం, షాదీఖానాను కట్టాం, మసీదుల మరమ్మతులకు నిధులు విడుదల చేశాం.

36,000 వేల మంది ముస్లిం ఆడబిడ్డలకు రూ.140 కోట్లు ఖర్చు చేసి పెళ్లిళ్లు చేశాం. ముస్లింలు మక్కాకు వెళ్లేందుకు రూ.లక్ష ఆర్థికసాయం చేస్తాం. టీడీపీ ఎల్లప్పుడూ మైనార్టీల కోసం అనేక విధాలుగా కృషిచేశాం.. భవిష్యత్తులో మరింత కృషి చేస్తాం. సీఏఏ, ఎన్‍ఆర్సీ బిల్లులకు వైసీపీ ఢిల్లీలో మద్దతిచ్చి గల్లీలో నాటకాలాడుతున్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాంను దొంగగా చిత్రీకరించి.. వేధించి అబ్దుల్ సలాం, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి ఆత్మహత్యచేసుకునేలా చేశారు వైసీపీ నాయకులు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని పరామర్శించావా.. వైసీపీ పాలనలో ఇలాంటి ఘటన సిగ్గనిపించడం లేదా? నందికొట్కూరులో ముస్లిం ఆడబిడ్డను దొంగగా చిత్రీకరించి అవమానించారు.

నందికొట్కూరులో శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ముస్లిం ఆడబిడ్డను బురగా తొలగించి చూసి అవమనించడమే కాక.. ప్రశ్నించినందుకు దాడి చేసి దౌర్జన్యం చేశాడు. చట్టాన్ని అతిక్రమిస్తున్న ఇలాంటి వ్యక్తులను కూటమి ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేం బానిసలం కాదు గౌరవంగా బతికే ముస్లింలమని వైసీపీ ప్రభుత్వానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములకు రక్షణ లేకుండా చేస్తున్నారు. కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా మీ భూములపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. మీ పట్టాదాస్తు పుస్తకంపై తన బొమ్మ వేసుకుని సైకో జగన్ రెడ్డి ఆనందం పొందుతున్నాడు.

టీడీపీ అధికారంలోకి రాగానే మిడుతూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. సిద్ధేశ్వరం హ్యాంగింగ్ బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుడతాం. గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. బుడగజంగాల ఎస్సీ కులధృవీకరణ పత్రాలు ఇస్తాం.

Leave a Reply