Suryaa.co.in

Andhra Pradesh

అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణం:చంద్రబాబు

అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణం. టీడీపీ కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించాలి . ఆయన జీవితమంతా పోరాటంతోనే గడిచిపోయింది. బ్రిటీష్ వారితో పోరాడి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు . ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులను సమీకరించి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేశారు.బ్రిటీష్ వారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు .ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్ లను ముట్టడించి, ఆయుధాలను స్వాధీనం చేసుకునేవారు . సాయుధ పోరాటంతో ముందుకు సాగారు . ఆ కాలంలోనే అల్లూరిlokesh సీతారామరాజును బంధించి చంపడానికి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు . ఉభయ గోదావరి జిల్లాల్లో పోరాటం చేస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు . 27 సంవత్సరాల వయసులోనే బ్రిటీష్ వారు ఆయనను చంపేశారు . ఆయన చేసిన పోరాటం శాశ్వతం. జాతీయ స్థాయిలో ఆయనకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. కేంద్రం 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించదలచడం గర్వకారణం. అందరూ స్వాగతించాలి. ప్రధాని స్వయంగా రాష్ట్రానికి వచ్చి ఆయన త్యాగాల్ని గుర్తించి నివాళులర్పించడం సముచితం. టీడీపీ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నాను. పార్లమెంటులో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని గతంలో స్పీకర్ నిర్ణయించారు, దీన్ని ఆచరించాలి. ప్రజలు ఆయనకు ఘననివాళులందించాలి. ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి.నాయకుల పోరాట పటిమ, వారి త్యాగాల వల్ల స్వేచ్ఛాభారత దేశంలో ఉన్నాం. అల్లూరి సీతారామరాజును మనస్మరణకు తెచ్చుకొని ఆయనకు నివాళులర్పించాలి. దేశాభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు సాగాలి.

LEAVE A RESPONSE