Suryaa.co.in

National

కర్నాటక ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి పిలుపు

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులు బెంగళూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లంతా కచ్చితంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రభుత్వం చేసే పనులను విమర్శించడం లేదా అభినందించే హక్కు ఉంటుందని నారాయణ మూర్తి పేర్కొన్నారు. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

షిమోగలో ఓటు వేయడానికి ముందు పూజలు జరిపి కుమారులిద్దరితో కలిసి ఓటు వేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు విజయేంద్ర భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుబ్లీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సీనియర్ సిటిజన్లకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్‌. రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ 80 సంవత్సరాలు దాటిన వారు ఉండగా, 17 వేల మంది 100 సంవత్సరాలు పైబడిన వారున్నారు. 5.55 లక్షల మంది ఓటర్లు అంగవైకల్యం ఉన్నటువంటి వారు ఉన్నారు. కర్ణాటకలో 2.62 కోట్ల మంది పురుష ఓటర్లు, 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు తమ ఓటర్లున్నారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరు శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు.

గాలి జనార్ధన్ రెడ్డి స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ ఉత్తర కర్ణాటకలో 47 స్థానాల్లో పోటీకి దిగింది. బళ్లారి పరిసర ప్రాంతాల్లో గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ కీలకంగా మారింది. బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి సతీమణి, బళ్లారి సిటీ నియోజకవర్గ కేఆర్‌పీపీ పార్టీ అభ్యర్థి గాలి లక్ష్మి అరుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయ నగర్ బీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమే ఓటు వేశారు.

LEAVE A RESPONSE