Suryaa.co.in

Telangana

తెలంగాణతో కేంద్రం పోటీ పడాలి

-తెలంగాణను కేంద్రం ఇబ్బందుల పాలు చేయవద్దు
-దేశ జిడిపిలో తెలంగాణ కీలక పాత్ర
-కేంద్ర అవార్డుల్లో తెలంగాణ ముందంజ
-అవార్డులు ఇచ్చే బదులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి
-మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఇండియా టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం 4 టూరిజం అవార్డులు సాధించిన అనంతరం తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస గౌడ్ ఏమన్నారంటే..

తెలంగాణ వస్తే పరిపాలన చేతకాదు…కరెంట్ ఉండదు..తెలంగాణ వస్తే ఆంధ్రప్రదేశ్ గానే ఉండాలని కోరుకుంటారు అని చాలా మంది మాట్లాడారు.గతంలో తెలంగాణ లో 9 జిల్లాలు కరువు జిల్లాలుగా ఉన్నాయని చెప్పేవారు.దేశ జిడిపిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది.అన్ని రంగాల్లో తెలంగాణలో ముందంజలో ఉంది.

కేంద్ర అవార్డుల్లో తెలంగాణ ముందంజలో ఉంది. గ్రామ పంచాయితీ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజలో అవార్డులు ఇస్తే 20 అవార్డుల్లో 19 తెలంగాణ కు వచ్చాయి. స్వచ్ఛభారత్ లో 13 అవార్డులు వచ్చాయి. టూరిజం అవార్డుల్లో బెస్ట్ టూరిజం స్టేట్ గా తెలంగాణకు అవార్డు వచ్చింది.

తెలంగాణకు టూరిజంలో అవార్డులు
తెలంగాణ ను ఎవరు ఆపలేరు..అభివృద్ధిని అడ్డుకోలేరు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పనులు ప్రధాని మోడీ గుర్తించాలి.తెలంగాణలో ఇంటింటికి నీరు అందుతుంది…ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ.దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ కు ప్రత్యేక సహకారం ప్రధాని మోడీ అందిస్తున్నారా ?మంచిగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించాలి కానీ కక్ష సాధిస్తార? తెలంగాణ పురోగతి చెందుతుంది కాబట్టే కేంద్రం అవార్డులు అందిస్తుంది.

తెలంగాణతో కేంద్రం పోటీ పడాలి.అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు,అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రులకు సహకరిస్తే దేశం బాగుపడుతుంది.అధికారం శాశ్వతం కాదు… అధికారం ఉన్నపుడు మంచి చేస్తే చరిత్రలో నిలుస్తారు.మేము చేస్తున్న పనులు తప్పు అయితే కేంద్రం తెలంగాణకు ఇన్ని అవార్డులు ఎలా వస్తున్నాయో ఆలోచించాలి.తెలంగాణలో అడవులు పెరుగుతున్నాయి. ..గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. తెలంగాణ అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే భారత్ నెంబర్ వన్ అవుతుంది.

కేంద్రం నుంచి సహకారం లేకపోయినా తెలంగాణ అవార్డులు సాధించింది.అవార్డులు ఇచ్చే బదులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ను కేంద్రం ఇబ్బందుల పాలు చేయవద్దు.

LEAVE A RESPONSE