Suryaa.co.in

Telangana

రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర

• రాజ్యాంగ వ్యతిరేక బిజెపిపై ఉద్యమించాలి
• అంబేద్కర్ స్పూర్తితో అత్యధికంగా పనిచేస్తోంది సిఎం కేసిఆర్
• రాజ్యాంగాన్ని కేసిఆర్ అమలు చేస్తున్నట్లు ఎవరూ చేయడం లేదు
• అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

(హనుమకొండ, డిసెంబర్ 06): ఈ దేశంలో అంబేద్కర్ స్పూర్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు పాటిస్తున్నట్లు, రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు మరెవరూ చేయడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రాజ్యాంగ నిర్మాత, బహుమేథావి, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ, అంబేద్కర్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి, మంత్రి నివాళులు అర్పించారు.

మంత్రితో పాటు మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, కలెక్టర్ గోపి, జిడబ్ల్యుఎంసి కమిషనర్ ప్రావీణ్య తదితరులు అంబేద్కర్ గారికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడారు…

ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి.భారతదేశానికి, ప్రపంచానికి ఆయన ఆదర్శం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక దళిత వర్గానికే కాదు సమాజంలోని అందరికీ చెందినవారు.అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ముఖ్యమంత్రి, మేము మంత్రులుగా, మిగిలిన వారు నాయకులుగా ఉన్నారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దేశంలో కేసిఆర్ గారు అమలు చేస్తున్నట్లు ఇంకెవరూ చేయడం లేదు. పేద ప్రజలను కాపాడుకునే వ్యక్తి కేసిఆర్ . బాబా సాహెబ్ అంబేద్కర్ గారి స్పూర్తితోనే మనం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నామని సిఎం కేసిఆర్ మాతో అంటుంటారు. దళితులకు, రైతులకు, పేదలకు, పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, అందరికీ అన్ని చేస్తున్నది రాజ్యాంగ స్పూర్తితోనే.

కేంద్ర ప్రభుత్వం బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఒప్పజెప్పి, రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉండేందుకు పూనుకుంది. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. రిజర్వేషన్లను మంటగలిపే కుట్ర చేస్తోంది మీరంతా చైతన్యంగా ఉండి, బిజెపి చేసే కుట్రలను వ్యతిరేకించాలి.సిఎం కేసిఆర్ అన్ని విషయాల్లో రాజ్యాంగ నిర్మాతకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారు. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నరు. వాటిని తిప్పికొట్టాలి.వరంగల్లో అంబేద్కర్ జయంతి, వర్ధంతిని కట్టయ్య గారి స్ఫూర్తితో మీరంతా గొప్పగా కొనసాగిస్తున్నందుకు అభినందనలు.

మీకు నా పూర్తి సహకారం ఉంటుంది.మీరు తీసుకునే కార్యక్రమాల్లో నేను ముందుంటి పని చేస్తా. గతంలో మాట ఇచ్చాను దానిని నిలబెట్టుకుంటా.దళితులకు,రాజ్యాంగానికి ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే దానిని తిప్పికొట్టడానికి మీ వెంట నేను ఉంటాను. అంబేద్కర్ గారిని స్పూర్తిగా తీసుకుని పనిచేయాలని కేసిఆర్ గారు పదే పదే చెప్తారు. దేశం అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలి.

ప్రభుత్వంలోని ప్రతి ఆస్తిని, ఫ్యాక్టరినీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోంది.ఉద్యమిస్తేనే అపుడు కేంద్రం దిగి వస్తుంది. లేకపోతే మొండిగా వెళ్తుంది. మీరు ఉద్యమిస్తే కేంద్రం కూడా దిగి వస్తుంది. రాజ్యాంగ వ్యతిరేక కుట్రలను తిప్పికొట్టే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి.

హనుమకొండలో బుద్ధవిహార్ నిర్మాణంపై రేపు మీ సమక్షంలో కలెక్టర్ ని, అధికారులతో మాట్లాడుతాను. ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్న ప్రవీణ్, సందీప్, శ్రీరాములు, రాజయ్య పెద్దలందరూ హృదయ పూర్వక నమస్కారాలు.

LEAVE A RESPONSE