– కీలక నిర్ణయాలకు ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో సహా స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు హాజరయ్యారు..జీ20 సదస్సు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆమోదించిన నిర్ణయాలు:
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధికి రూ.3,760 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్‌కు ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం.
* మొత్తం ఖర్చు తామే భరిస్తామని తెలిపిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.
* 2030-31 వరకు 5 దశల్లో నిధులు విడుదల చేస్తామన్న అనురాగ్ ఠాకూర్.
* దేశంలో 4 వేల మెగావాట్ల నిల్వకు ఈ సిస్టమ్ ఉపకరిస్తుందన్న కేంద్రం.
* యబిలిటీ గ్యాప్ ఫండింగ్ వల్ల రూ.9,500 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న కేంద్ర మంత్రి.
* ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ స్కీమ్ (IDS) 2017 కింద హిమాచల్, ఉత్తరాఖండ్ లో పరిశ్రమల
అభివృద్ధికి అదనపు నిధులు ఇవ్వనున్న కేంద్రం.
* రూ.1,164 కోట్లు కేటాయింపు నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.