– ఎంపీ వద్దిరాజు వినతికి సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ
-ఫలించిన వద్దిరాజు కృషి
– తీరనున్న ఖమ్మం ప్రజల రైల్వే కష్టం
ఖమ్మం: నగరంలోని రైల్వే మధ్య గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అవసరమైన భూమి తెలంగాణ ప్రభుత్వం తమ శాఖకు బదలాయించిన వెంటనే ఆర్వోబీ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే (ఏస్సీఆర్)జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గత నెలలో శ్రీవాస్తవను కలిసి వినతిపత్రం అందజేసి ఆర్వోబీ నిర్మాణం అవసరం గురించి వివరించారు. ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి పట్ల ఏస్సీఆర్ జనరల్ మేనేజర్ సానుకూలత వ్యక్తం చేస్తూ బదులిచ్చారు.
ఖమ్మం – పందిళ్ళపల్లి మధ్యలో 104 లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీని పూర్తిగా రైల్వే శాఖ నిధులతో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటికి సంబంధించిన భూమిని తమ శాఖకు త్వరితగతిన అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని ఎంపీ రవిచంద్రకు రాసిన ప్రత్యుత్తరంలో ఏస్సీఆర్ జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తమ శాఖకు భూమి అప్పగించిన వెంటనే ఆర్వోబీల నిర్మాణ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ ఎంపీ వద్దిరాజుకు రాసిన లేఖలో వివరించారు.