Suryaa.co.in

Andhra Pradesh

మిసెస్ సౌత్ ఇండియాగా చాగలమర్రి మహిళ

చాగలమర్రి గ్రామానికి చెందిన ఎస్.చరిత సుమాలిని మిసెస్ సౌత్ ఇండియా కు 2022వ సంవత్సరంలో సెలెక్ట్ అయ్యారు.థామస్ ఆనంద్ , నీరజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.మొదటి కుమార్తె ఎస్.చరిత సుమాలిని .రెండవ కుమార్తె ఎస్.హెలెన్ .ఎస్.చరిత సుమాలిని తొమ్మిదేళ్ళ క్రితం కెమికల్ ఇంజినీరింగ్ గా విధులు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డకు చెందిన మధుబాబుతో వివాహమైంది.వీరు ప్రస్తుతం ఢిల్లీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెళ్లయిందని ఎస్.చరిత సుమాలిని వంట గదికే పరిమితం కాకుండా తనకున్న ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ , ఫ్యాషన్ షోకు ధరఖాస్తు చేసుకున్నారు. ఫరెవర్ స్టార్ ఇండియా సంస్థ జైపూర్ లో 2022వ సంవత్సరం డిసెంబర్ లో నిర్వహించిన మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. పెళ్ళైన మహిళలకు నిర్వహించే ఈ మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో ఆమె టైటిల్ విన్నర్ గా గెలుపొందినట్టు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

చరిత సుమాలిని విలేఖర్లతో మాట్లాడుతూ తన భర్త మధుబాబు ప్రోత్సాహంతోనే ఈ అవార్డ్ సాధించగలిగానని చరిత సుమాలిని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు వాస్త్యవులు ధన్య టివి చానెల్ వారు 2023వ సంవత్సరం మదర్స్ డే సందర్భంగా మా ఇంటి వంట కార్యక్రమం కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు. అందులో పాల్గొనడానికి కృషి చేసిన అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్.చరిత సుమాలిని పేరు ఇచ్చారు. పేరు ఇచ్చాక మీకు నచ్చింది ఏదైనా వంట కార్యక్రమాన్ని వీడియో తీసి వాటిని వివరిస్తూ ఒక వీడియో క్రియేట్ చేసి పంపమని చెప్పారు.

ఆ వీడియో చూశాక దన్య టివి యాజమాన్యం ఎస్.చరిత సుమాలినిని ఎన్నుకున్నారు.అక్కడ మరో ప్రైజ్ గిఫ్ట్ గెలుచుకున్నారు.ఆ గిఫ్ట్ జులై 4వ తేదీ మంగళవారం చాగలమర్రి పట్టణములో ” అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ” వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు చేతుల మీదుగా ఎస్.చరిత సుమాలిని అందుకున్నారు.

భర్త మధుబాబు విలేఖర్లతో మాట్లాడుతూ తనకు ఎప్పటి నుంచో ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉండేదని అది ఈ విధంగా తాను మిసెస్ ఇండియాగా గెలుపొందాలని చాలా కష్టపడి చివరకు మిసెస్ సౌత్ ఇండియా పేరు సంపాదించింది చాగలమర్రి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టిందని చెప్పుకొచ్చారు. చాగలమర్రి గ్రామంలో మిసెస్ సౌత్ ఇండియా ఎస్.చరిత సుమాలిని తో వల్లంకొండు సాయి సుదర్శన్ రావు , నాసిర్ పఠాన్ , ఇన్స్టాగ్రాంలో చాగలమర్రి టౌన్ పేజీ ఫౌండర్ బాలాజీ , ప్రిన్స్ , పలువురు తనతో ఫోటో దిగారు.

LEAVE A RESPONSE