-హెచ్ ఆర్ సి మహిళా ఉద్యోగులను సత్కరించిన ఛైర్మెన్ మరియు కమిషన్ జూడిష్యల్ సభ్యులు, నాన్ – జూడిష్యల్ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఛైర్మెన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి మరియు కమిషన్ జూడిష్యల్ సభ్యులు డి. సుబ్రహ్మణ్యం, నాన్ – జూడిష్యల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషన్ లోని మహిళా ఉద్యోగులకు సత్కరించారు. మహిళా ఉద్యోగులు శ్రీమతి జి సునీత, శ్రీకళ, కమిషన్ లో బందోబస్తు నిర్వహించే మహిళా పోలీసు సిబ్బంది మరియు పలువురు పారిశుధ్య మహిళా కార్మికులను సత్కరించారు.
అనంతరం ఛైర్మెన్ మాట్లాడుతూ….యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ – స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల చదువు ఏ సమాజానికైనా వెలుగునిస్తుంది. వారిలో చైతన్యం ప్రపంచాన్ని నడిపిస్తుంది. మహిళల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం రావాలి. ఆయా రంగాల్లో రాణించిన, రాణిస్తున్న వారిని స్పూర్తిగా తీసుకోవాలి. వీరికి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరునిది.
చరిత్రలో నిలిచిపోయిన వీర వణితలు ఎంతో మంది ఉన్నారు. తల్లిగా, భార్యగా తన పాత్ర పోషిస్తూనే రాజ్యాన్ని కాపాడిన వీరవణితల చరిత్రలు భారత దేశంలో చాలా ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది వీర వణితలు తమ మాన, ప్రాణాలు వదిలారు. బ్రిటీష్ పరిపాలన వెనుతిరిగే వరకు మగవారితో సమానంగా పోరాడారు. ఇక ప్రస్తుత కాలంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారు. రాజకీయ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అంతరిక్ష రంగంలో కూడా ముందడుగు వేస్తున్నారు.
నాన్ జ్యుడిషియల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ మహిళాలు చైతన్యం పొందితే సమాజం చైతన్యం పొందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి రమణమూర్తి, పిఆర్ ఓ రవికుమార్, కమిషన్ విభాగాధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్, కమిషన్ సిబ్బంది శ్రీనివాస రెడ్డి రఫి, ధన్రాజ్ తదితరులు పాల్గొన్నారు.