వైసీపీ నేతల వ్యాపారాలు, ఆదాయాల కోసం కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు ప్రైవేటీకరణ

Spread the love

– విశాఖ ఉక్కును కేంద్రం అంబానీల పరం చేస్తుంటే క్రిష్ణపట్నం పవర్ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి అదానీల పరం చేస్తున్నారు
– పాతికేళ్ల లీజుకాలం తర్వాత ప్రాజెక్టులో మిగిలేది తుక్కు ఇనుము మాత్రమే
– ప్రతిష్టాత్మక సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టును ప్రైవేటు పరం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
– ముత్తుకూరు మండలం నేలటూరు పర్యటన సందర్భంగా జెన్ కో ప్రాజెక్టు ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రైవేటుకు దారాధత్తం చేయాలనుకోవడం దుర్మార్గం. 2400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రతిష్టాత్మక సూపర్ క్రిటికల్ ప్రాజెక్టును 25 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి అప్పగించాలనే ప్రయత్నం వెంటనే మానుకోవాలి.

25 ఏళ్ల లీజుకాలం తర్వాత ప్రాజెక్టులో తుక్కు ఇనుము(స్క్రాప్) మాత్రమే మిగులుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఇద్దరూ నష్టపోబోతున్నారు. సరైన సమయంలో నగదు చెల్లిస్తే తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు లభిస్తుంది..ఆ పని చేయలేక ప్రైవేటుకు అప్పగించడం దురదృష్టకరం.

ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన కంపెనీల ద్వారా 9 లక్షల టన్నుల ఎర్రమట్టితో కూడిన నాసిరకమైన బొగ్గు దిగుమతి చేసుకుని వందల కోట్ల నష్టం తెచ్చారు.నాసిరకమైన బొగ్గు కారణంగా యంత్రాలు
somi మరమ్మతులకు గురవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ధర కూడా గణనీయంగా పెరిగిపోతోంది.కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టులో ఎక్కడా లేని విధంగా 0.2 మ్యాన్ పవర్ తో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

అటు రెగ్యులర్, ఇటు కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో విధులు నిర్వర్తించడంతోనే ఇది సాధ్యమైంది.ఓ వైపు విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం అంబానీల పరం చేయాలని చూస్తుంటే కాలుష్య రహిత క్రిష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అదానీల పరం చేస్తోంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా వైసీపీ ప్రభుత్వం మొక్కుబడిగానే వ్యతిరేకత తెలిపి మౌనందాల్చింది.21 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించిన క్రిష్ణపట్నం ప్రాజెక్టును కూడా దారాధత్తం చేస్తోంది.
రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగి కోతలు మొదలైతే ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం తెలిసి వస్తుంది.ఆర్టీపీపీ, వీటీపీఎస్, క్రిష్ణపట్నం పవర్ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును తెస్తే విద్యుత్ కొరతే ఏర్పడదు.ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వేల కోట్లు సొంత ఖజానాకు జమ చేసుకోవడం కోసం ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలు.

మీ సొంత ఆదాయాల కోసం ప్రజలను చీకటిమయం చేస్తారు..రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేస్తారు..మీరు మాత్రం డబ్బులు మూటగట్టుకోవడం అన్యాయం, దుర్మార్గం.రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాలను తాకట్టుపెట్టే అధికారం, హక్కు ఈ ప్రభుత్వానికి లేదు.మేం ప్రజల కోసం నిలబడుతుంటే వైసీపీ నాయకులు ఏమో సొంత ఆదాయం కోసం కంపెనీల తరఫున నిలబడుతున్నారు. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టులోని 300 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.

75 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకే అని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికారు..చట్టం చేశామని గొప్పలు చెప్పుకున్నారు.మీరు తెచ్చిన చట్టం అమలవుతుందో..లేదో ఒక్క సారి పరిశీలించుకోండి.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, ముత్తుకూరు మండల పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, తోటపల్లి గూడూరు మండల పార్టీ అధ్యక్షులు సురేష్ రెడ్డి,రమేష్ స్వామి, ముత్తుకూరు మండల తెలుగు యువత అధ్యక్షలు ఈపూరు మునిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యాదవ్, శ్రీధర్ రెడ్డి, సునీల్ రెడ్డి, నేలటూరు, పైనా పురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

Leave a Reply