కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం భవన నిర్మాణ పనులను హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి పరిశీలించారు. ఈ సందర్బంగా పనులు జరుగుతున్న తీరు అక్కడి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జుడీషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జుడీషియల్ సభ్యులు డాక్టర్ గోచిపాత శ్రీనివాస రావు, కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఉన్నారు.అయితే గతంలో హై కోర్టు ఆదేశాలకు లోబడే మానవ హక్కుల కమిషన్,లోకాయుక్త కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హై కోర్టు ఆదేశించిన తరునంలో మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి కర్నూల్ కేంద్రంగానే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుతం.ఇటీవల 3 రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్న నేపధ్యంలో మానవ హక్కుల కమిషన్ కూడా అమరావతి కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టులో కేసు పరిశీలనలో ఉంది.