-తొలగించాలంటున్న పదద్మశాలీలు
-ససేమిరా అన్న రజక సంఘాలు
-పోలీసులతో ఘర్షణ
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు లో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహం వివాదాలకు దారితీసింది చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా స్థానిక రజక సంఘం ఐలమ్మ విగ్రహాన్ని నిర్మించింది. దీనిపై స్థానిక పద్మశాలి వర్గీయులు నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తమ దేవుడైన మార్కండేయని దేవాలయం మెట్లను ఆ నుకొని, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నెలకొల్పారని దీని వెంటనే తొలగించాలని పద్మశాలి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమె విగ్రహాన్ని తొలగించేది లేదని రజక సంఘం స్పష్టం చేయడంతో , గురువారం పట్టణంలో పద్మశాలి వర్గీయులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా పోలీసులు- పద్మశాలి వర్గీయులకు వివాదం నెలకొనడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సంఘటనలో నలుగురు పద్మశాలి వర్గం నాయకులు గాయపడ్డారు.