వైఎస్సార్ కి కాంగ్రెస్ వెన్నుపోటు

-వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదు
-కాంగ్రెస్ పార్టీ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ కాదు. వైఎస్సార్ నా తండ్రి.వైఎస్సార్ కి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. నేను పబ్లిక్ గా చెప్తున్నా. 30 ఏళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ కి సేవ చేశాడు.2004లో 2009 లో రెండు సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. వైఎస్సార్ చేసిన పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో వైఎస్సార్ కీలకం.

అలాంటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ చనిపోతే దోషి అని FIR లో నమోదు చేసింది. ఇది వైఎస్సార్ కి వెన్నుపోటు పొడిచినట్లు కాదా ?రాజశేఖర్ రెడ్డి గారిని మోసం చేసినట్లు కాదా? కనీసం హెలికాప్టర్ లో చనిపోతే ఎలా చనిపోయాడు అని దర్యాప్తు కూడా చేయించలేదు. అసలు పట్టించుకోలేదు. అంత గొప్పనాయకుడు అని కృతజ్ఞత కూడా లేదు.బ్రతికి ఉన్నప్పుడు ఇంద్రుడు – చంద్రుడు అని పొగిడారు. చనిపోయాక పొగడక పోయినా పర్వాలేదు..కానీ FIR నమోదు చేసి అవమాన పరిచారు.. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉండాలి. ఇప్పుడు వైఎస్సార్ ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతుందా?

వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదు. ఇప్పుడు వైఎస్సార్ బ్రతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మి వేసేవాడు.కాంగ్రెస్ పార్టీ కి వైఎస్సార్ ఖ్యాతిని తెచ్చారు…వైఎస్సార్ కి కాంగ్రెస్ ఖ్యాతిని తేలేదు. వైఎస్సార్ చనిపోయాక కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారంలో ఉంది. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు. నాయకుడు అంటే వైఎస్సార్ లా ఉండాలని నిరూపించాడు. వైఎస్సార్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయలేదు…వైఎస్సార్ పాదయాత్ర చేశాడు.

ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాలు వైఎస్సార్ పెట్టినవి.కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ఇన్ని పథకాలు ఉన్నాయా ఎవడైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇన్ని పథకాలు ప్రవేశ పెట్టారా..? వైఎస్సార్ గుండె ఉన్న మనిషీ..మంచి మనిషిపాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళారా చూసిన మనిషి. కష్టాలు చూసి వైఎస్సార్ చలించి పోయారు.

పేద బిడ్డలు పెద్ద చదువులు చదవక పోతే వీళ్ళ బ్రతుకులు బాగుపడవు అని వైఎస్సార్ అనుకున్నారు.అప్పుడే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పుట్టింది.ప్రజలు అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు అని తెలుసుకున్నారు. ఒక ఇంట్లో జబ్బు వస్తె ఆ జబ్బు నయం చేయించుకోలేక అప్పుల పాలు అవుతున్నారు అని తెలుసుకున్నారు. అప్పుడు పుట్టింది ఆరోగ్య శ్రీ. ఇలా ప్రతి పథకం వైఎస్సార్ ప్రజల నుంచి తెలుసుకొని ప్రవేశ పెట్టిన పథకాలు.

Leave a Reply