Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగాగ్ర‌హం…

బ‌డిలోనే మాస్టార్ల‌కి పోలీసుల్ని కాప‌లా పెట్టారు ముఖ్య‌మంత్రి గారు. బ‌స్సెక్కినా, రైలెక్కినా బ‌డితెపూజ త‌ప్ప‌దంటూ త‌న వైసీపీ ముఠాల ద్వారా, వైసీపీ మీడియా-సోష‌ల్‌మీడియా ద్వారా సంకేతాలు పంపారు సీఎం.గృహ‌నిర్బంధం-అరెస్టులు-జైళ్ల‌కు త‌ర‌లింపుతోపాటు విజ‌య‌వాడ‌కి ప్ర‌భుత్వ ఉద్యోగులు రాకుండా

సీఎం జ‌గ‌న్‌రెడ్డి,ఆయ‌న గ్యాంగులు పోలీసుల‌తో క‌లిసి ప‌న్నిన ఏ కుట్రా ఉద్యోగుల ఆగ్ర‌హం ముందు నిల‌వ‌లేక‌పోయాయి.విజ‌య‌వాడ బీఆర్టీఎస్ రోడ్డు పోరాట బాటైంది.నిర‌స‌న స్వ‌రాలు మిన్నుముట్టాయి. రెండు చేతుల‌తో ఓట్లేసిన మేమే జ‌గ‌న్‌రెడ్డిని గ‌ద్దె దింపేవ‌ర‌కూ నిద్ర‌పోమంటూ ఉద్యోగులు శ‌ప‌థాలు

చేశారు. 5 వేల మంది ఉద్యోగులు వ‌స్తార‌ని పోలీసుల్ని అనుమ‌తి కోరితే, వారు నిరాక‌రించి నిర్బంధించ‌డానికే మొగ్గు చూపారు. ల‌క్ష‌ల మంది ప్ర‌వాహంలా పోటెత్తారు. మ‌హిళా ఉద్యోగులు జ‌గ‌న్‌రెడ్డిని శాప‌నార్థాలు పెట్టారు. ప్ర‌తీ ఒక్క‌రినోటా మ‌మ్మ‌ల్ని మోస‌గించిన జ‌గ‌న్‌..మా ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసిన

జ‌గ‌న్ ని ఓడించి తీరుతామ‌నే ప్ర‌క‌ట‌న‌లే. నీకు 151 సీట్లిచ్చి సీఎంని చేసింది మేమే…మ‌మ్మ‌ల్ని వంచించినందుకు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దింపేది మేమేనంటూ నిన‌దించారు ల‌క్ష‌ల మంది ఉద్యోగులు.

– చిరుమామిళ్ల కృష్ణ

LEAVE A RESPONSE