ప్రస్తుతం 35+ వయసున్న వారిలో చందమామ కథల పుస్తకం గురించి తెలియని వారు ఉండరు అంటే ఆశ్చర్యం లేదు. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం చందమామ ప్రచురితం కావడం లేదు. పాత పుస్తకాలు ఉన్నా బావుణ్ణు, మన పిల్లలచే చదివించవచ్చు అని చాలా మంది అనుకుంటుండవచ్చు. అటువంటి వారి కొరకే ఎవరో మహానుభావుడు 1947 జనవరి నుండి 2012 డిసెంబర్ వరకూ విడుదల అయిన అన్ని పుస్తకాలనూ PDF రూపంలో తన వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. వీటిని ఎవ్వరమైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వీటిని మనం పిల్లలచే చదివించవచ్చు, లేదా మనమే చదివి వినిపించవచ్చు. దీనివలన పిల్లలకు తెలుగు చదవడం వస్తుంది, అలానే భాషపై పట్టు కూడా పెరుగుతుంది. మనం చంపేసిన ఎన్నో తెలుగు పదాలు ఈ కథలలో ఉంటాయి. కథల రూపంలో నేర్పడం కనుక, ఇది కొంత తెలికగానే ఉంటుంది.
అవకాశం ఉన్నవారు, మీ పిల్లలు చదువుకునే బడిలో తెలుగు బోధించే వారికి కూడా వీటిని పంపండి.
లింక్:http://granthanidhi.blogspot.com/2020/04/candamama.html?m=1