హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నిర్వహించిన దశ మహా విద్యా పూర్వక నవ చండీ యాగ మహోత్సవం లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరి క్షేమం కోసం యాగం నిర్వహిస్తున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను చంద్రబాబు అభినందించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అట్లూరి సుబ్బారావు, మీడియా కన్వీనర్ ప్రకాష్‌రెడ్డి , తెలుగుమహిళా నేత లత పాల్గొన్నారు.