అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు

Spread the love

– ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు
– మంత్రి తలసాని

అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం GHMC కార్యాలయంలో ఈ నెల 18 నుండి జూన్ ౩౦ వ తేదీ వరకు నిర్వహించే కంటి వెలుగు 2 కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, MLC లు ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, కౌసర్ మొహినోద్దిన్, కార్పోరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, ఎర్రోళ్ళ శ్రీనివాస్, గజ్జెల నగేష్, నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, కలెక్టర్ అమయ్ కుమార్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్, హెల్త్ అడిషనల్ డైరెక్టర్ పద్మజ, హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, GHMC జోనల్ కమిషనర్ లు, డిప్యూటీ కమిషనర్ లు, హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కంటిtsy వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 827 బృందాలను ఏర్పాటు చేయగా, ఇప్పుడు 1500 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి ప్రత్యేకంగా వాహనాలను కూడా సిద్దం చేసినట్లు వివరించారు.

GHMC పరిధిలోని 91 వార్డు లలో 115 శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. GHMC పరిధిలో శిభిరాల ఏర్పాటు కోసం కమిటీ హాల్స్, మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ గ్రౌండ్ లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. శిభిరాల వద్ద సరైన పర్నిచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వ్రుద్దులను కూడా దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

100 పని దినాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిభిరాలు పని చేస్తాయని తెలిపారు. ప్రతి టీం లో ఒక డాక్టర్, ఒక కంటి వైద్యుడు, ఒక పార్మసిస్ట్, ఆశా వర్కర్ లతో కలిపి 10 మంది వరకు ఉంటారని మంత్రి తెలిపారు. ఇది ఎంతో గొప్ప కార్యక్రమం అని, గిన్నీస్ బుక్ లో నమోదయ్యే విధంగా విజయవంతం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50 లక్షల మందికి కళ్ళద్దాలు అందజేసినట్లు పేర్కొన్నారు.

ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ లు అవసరమైన వారికి సరోజినీ దేవి, LV ప్రసాద్ హాస్పిటల్స్ మాత్రమే కాకుండా లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ ఇతర స్వచ్చంద సంస్థల కు చెందిన హాస్పిటల్స్ సేవలను కూడా వినియోగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన మందులు అన్ని శిభిరాల వద్ద అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొనే విధంగా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే విజయవంతంగా నిర్వహించబడతాయని అన్నారు.

మీ మీ పరిధిలో ఉన్న కార్పొరేటర్ లు, కాలనీలు, బస్తీల కమిటీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని GHMC అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కంటి పరీక్ష కోసం 300 నుండి 500 రూపాయల వరకు ఫీజుగా వసూలు చేస్తారని, ఆపరేషన్ కోసం వేల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. పేద, మద్య తరగతి ప్రజల ఆర్ధిక ఇబ్బందులు, ఆరోగ్య సంరక్షణ ను దృష్టిలో ఉంచుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం అని, పేద, మద్య తరగతి ప్రజలకు ఒక వారం లాంటిదని సమావేశంలో పాల్గొన్న MLA లు, MLC లు ప్రశంసించారు.

Leave a Reply