-2014 నుంచి 2019 వరకు అన్ని ఛార్జీలు పెంచారు
-ఆనాడు ఇప్పుడున్న విపత్కర పరిస్థితులు కూడా లేవు
-అందుకే చంద్రబాబు తన యాత్ర విడిచి పెట్టాలి
-చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరడం లేదు
-అందుకే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటున్నారు
-మూడేళ్లుగా ఆయన అసలు ఈ ప్రాంతాన్ని మర్చిపోయారు
-ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ పర్యటిస్తున్నారు
-అర్ధం లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు
-పార్వతీపురం ప్రెస్‌మీట్‌లో మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
మూడేళ్లుగా దాక్కున్నారు:
చాలా ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు. మూడు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఉందని, ఈ రాష్ట్రంలో తాను ప్రతిపక్ష నాయకుడిని అని, ఈ రాష్ట్ర ప్రజలు తనను గతంలో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారన్న విషయాలు మర్చిపోయి, మూడేళ్లుగా ఎక్కడ దాక్కున్నాడో తెలియని ఈ వ్యక్తికి ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చింది. అందుకే నిన్నటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దంటున్నారు:
అయితే ఉత్తరాంధ్రకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, ఉత్తరాంధ్రకు ముఖద్వారంగా ఉన్న విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరగకూడదు. ఈ ప్రాంతం వెనకబడి పోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పోరాటాలు మనందరం చూశాం.
ఒకానొక సందర్భంలో, ఏడాదిన్నర క్రితం విశాఖలో అడుగు పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఏ రకంగా తరిమి కొట్టారు. దీంతో ఏ విధంగా తోక ముడుచుకుని పారిపోయాడో అందరం చూశాం.
ఆ పర్యటన చేస్తే బాగుండేది:
ఇక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రతిపక్ష నేతగా బాధ్యతగా వ్యవహరించని ఆయన నిన్నటి నుంచి బాదుడే బాదుడు పేరుతో పర్యటిస్తున్నారు. ఆయన ఆ పర్యటన పదాలు మార్చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం.
‘తెలుగుదేశం పార్టీకి బాధలే బాధలు’ అని ఆయన పర్యటన చేసి ఉంటే బాగుండేది. 2019 నుంచి ఆ పార్టీ పడుతున్న ఇబ్బందులు. ఆ పార్టీని నడిపించలేక ఆయన కొడుకు పడుతున్న బాధలు, కొడుకును చూసి ఆయన పడుతున్న బాధ. ఇవన్నీ చూసి ఆయన బా«ధలే బాధలు అని పర్యటన మొదలుపెడితే బాగుండేది.
చంద్రబాబుకు నైతిక హక్కు లేదు:
ఇవాళ అన్ని ఛార్జీలు పెంచారని, కరెంటు ఛార్జీలు కూడా పెంచారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. కానీ ఆయనకు ఆ విమర్శ చేసే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఏ ఇబ్బంది లేనప్పుడు, రాష్ట్రంలో కోవిడ్ వంటి మహమ్మారి లేనప్పుడు, 2014 నుంచి 2019 వరకు రేట్లు ఎందుకు పెరిగాయన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ ఇబ్బందులు లేనప్పుడు రేట్లు ఎందుకు పెరిగాయన్న దానికి ఆయన సమాధానం చెప్పాలి.
ఆరోజు ఈ విధమైన పరిస్థితులు లేవు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన సందర్భాలు లేవు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగలేదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉన్నప్పటికీ ఏ విధమైన భారం పేదల మీద పడకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టాలి. వారిని రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలన్న తాపత్రయం చంద్రబాబుగారిలో కనబడుతోంది.
చంద్రబాబు కోరిక నెరవేరదు:
ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి. ఎప్పుడెప్పుడు తనకు అధికారం వస్తుంది అన్న తాపత్రయం ఆయనలో కనబడుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు బతికున్నంత కాలం అధికార పీఠం తెలుగుదేశం వైపు రాదన్న విషయం ఆయన గుర్తు పెట్టుకోవాలి.
మేము ఎలాంటి పరిíస్థితులు ఉన్నా, పేదల మీద భారం పడకూడదని చూస్తున్నాం. కోవిడ్ వంటి సమస్యలు వచ్చినా, ఇంకా ఏ ఇబ్బందులు ఎదురైనా ఏ పథకాలూ ఆపడం లేదు. దాదాపు రూ.1.40 లక్షల కోట్లు వివిధ పథకాల కింద నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి.
గతంలో మీరు పేదలకు ఇచ్చింది తక్కువ. పెంచింది ఎక్కువ. కానీ జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చింది ఎక్కువ. పెంచింది చాలా తక్కువ. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒక వైపు కోవిడ్, మరోవైపు యుద్ధం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబుగారు వాస్తవం గుర్తించాలి.రాజకీయ అవసరాల కోసం ఇలాంటి పర్యటనలు మానుకోవాలి.మీకు రాజకీయ భవిష్యత్తు లేదు. కాబట్టి రాజకీయ అవసరాల కోసం ఇక్కడ తిరగవద్దని చంద్రబాబును కోరుతున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.