ఎంపీ విజయసాయి రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు గ్రహణం పట్టిందని ఫలితంగా మునుగోడు ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసి చివరకు డిపాజిట్ కూడా కోల్పోయిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలు పేర్కొన్నారు.
లోకేష్ ది శునకానందం
ఎవరి ఇంట్లోనో జరిగే కుటుంబ కలహాలను వైకాపాకు అంటగడుతూ పప్పునాయుడు నారా లోకేశ్ శునకానందం పొందుతున్నాడని ఇంత బాధ్యత రాహిత్యంగా ఉన్న లోకేష్ ను చేస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఉత్తరాంధ్రలో చంద్రబాబు నియమించిన సామంత దొంగ కూనరవి
ఉత్తరాంధ్ర తెలుగుదొంగల పార్టీ మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ సామ్రజ్యమా? అతను ఉత్తరాంధ్రకు చంద్రబాబు నియమించిన సామంత దొంగా అంటూ ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్రపై రెడ్లపెత్తనం ఎంటని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవిచేసిన విమర్శలపై మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో స్థిరపడాలంటే ఈ సామంత దొంగ వద్ద పాస్ పోర్టు తీసుకోవాలని అని ప్రశ్నించారు.
కడిగిన ముత్యంలా సీనియర్ ఐఏఎస్ అధికారిణి
ఒక అహంకార కేడీ పోలీస్ అధికారి సహకారంతో దుర్మార్గపు పచ్చకుల మంద ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కేసుల్లో ఇరికించారని, ఇప్పుడామే కడిగిన ముత్యంలా బయటపడ్డారని అన్నారు. వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నన్యాయ సూత్రాన్ని ఆ పోలీస్ కాలరాశాడని అన్నారు.