-దమ్మున్న నాయకుడికి ప్రత్యక్ష ఉదాహరణ వైయస్ జగన్
-మంత్రి జోగి రమేష్
రాష్ట్రంలో చంద్రబాబే పెద్ద సైకో…ఆయన కుమారుడు లోకేష్ పిల్ల సైకో అని మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. వార్డు మెంబర్‌గా కూడా లోకేష్ గెలవలేని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పులికి, పిల్లికి తేడా ఎక్కడా? వైయస్ జగన్ సింహం. లోకేష్ ఒక నక్క. నక్కజిత్తుల నారా చంద్రబాబు కొడుకు లోకేష్..తండ్రి కొడుకులు ఇద్దరూ ఏం చేయగలరని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్లు పరిపాలన చేశాం..నాకు ఓటు వేయమని అడిగేందుకు చంద్రబాబుకు ఒక్క స్కీమ్ లేదన్నారు. ఇలాంటి వ్యక్తి వైయస్ జగన్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
చంద్రబాబు పెద్ద సైకో అయితే..పిల్ల సైకో లోకేషం. మధ్యలోనే లోకేష్ పాదయాత్ర ఆగిపోతుందన్నారు. చంద్రబాబు, లోకేష్ వీధి రౌడీల్లా తయారయ్యారు. లోకేష్‌ది పాదయాత్ర యాదు..పనికిమాలిన యాత్ర అని విమర్శించారు. వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.
దమ్మున్న నాయకుడికి ప్రత్యక్ష ఉదాహరణ వైయస్ జగన్
ఢిల్లీ కోటను గజగజలాడించిన దమ్మున్న మొనగాడు వైయస్ జగన్ అన్నారు. సీఎం వైయ‹స్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. లోకేష్..నీదొక పాదయాత్ర..నువ్వొక లీడర్‌వా? అని నిలదీశారు. లోకేష్ డబ్బుంటే సరిపోదు..ఖలేజా ఉండాలన్నారు. భయం అంటే తెలియని వ్యక్తి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ ప్రస్టేషన్‌లో ఉన్నారని, సీఎం వైయస్ జగన్‌ను పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు. మహా శివరాత్రి రోజు శ్రీకాళహస్తిలో ఎవరైనా పోలీసులను పర్మిషన్ అడుగుతారా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.