Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ఓ మాస్టర్ మేనిపులేటర్

– ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, సెప్టెంబర్ 1: మాస్టర్ మేనిపులేటర్ చంద్రబాబు అన్ని జెండాలతో జతకట్టి వార్ వన్ సైడ్ అంటాడు. ఇంకోసారి వ్యతిరేక ఓట్లు చీల్చి మాస్టర్ స్ట్రాటజీ అంటాడు. ప్లస్, మైనస్, కుల మీడియా వ్యూహాలు కంటే జనం సపోర్టు ముఖ్యమని ఎప్పుడు తెలుసుకుంటాడోనని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గురువారం పలు అంశాలు వెల్లడించారు. చంద్రబాబు మేనిపులేషన్ లో మాస్టర్ అయినా కూడికలు, తీసివేతల రాజకీయ లెక్కల్లో పూర్ అని అన్నారు.

హిమంత్ వాదనపై బాబు నోరు విప్పాలి
ప్రాంతీయ అసమానతలు లేకుండా దేశంలో 5 రాజధానులు ఏర్పాటు చేయాలని అస్సాం బీజేపీ సీఎం హిమంత్ శర్మ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే లక్ష్యంతో రాష్ట్రంలో 3 రాజధానులు ప్రకటించి వికేంద్రీకరణ ప్రాధాన్యతను చాటి చెప్పారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం అంటున్న బాబు హిమంత వాదనపై నోరువిప్పాలని డిమాండ్ చేశారు.

దోచుకున్న రూ 1000 కోట్ల ముందు కక్కు రఘురాజా
నరసాపురం ఎంపీ రఘురామరాజు ఢిల్లీలో చెట్టు కింద కూర్చొని ప్రెస్ మీట్లతో కామెడీ పండించడమే కాక సర్వేలతోనూ వినోదం పంచుతున్నాడని విజయసాయి రెడ్డి అన్నారు. చెట్టు కిందకు చేరినంత మాత్రాన గౌతమ బుద్దుడు కాలేడని అన్నారు. విశ్వసనీయత లేని వ్యక్తి సర్వేలు చేయడం హాస్యాస్పదమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏం జరిగినా ఈ స్టాండప్ కమెడియన్, విగ్గు రాజు (రఘురామరాజు) ఒక పెగ్గేసుకొని పచ్చ మీడియా ముందుకు వచ్చి కట్టు కథలను అల్లుతాడు. రాష్ట్రం సంగతి అటుంచి నువ్వు బ్యాంకులకు ఎగ్గొట్టి మెక్కేసిన రూ.1000 కోట్ల ప్రజల సొమ్ము గురించి కక్కు అంటూ మండిపడ్డారు.

ఏపీలో అభివృద్ధి వేగవంతం
భారతదేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ బలపడుతోందని, జూన్ త్రైమాసికానికి జీడీపీ వృద్ది రేటు 13.5%కి చేరుకుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, వ్యవసాయరంగం, నిర్మాణరంగం, సేవారంగాలు విజయాలు సాధిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేని ప్రతిపక్ష తెదేపా గగ్గోలు పెడుతోందని అన్నారు.

LEAVE A RESPONSE